Actress Poorna : వైట్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తోన్న పూర్ణ.. ఎంగేజ్మెంట్ ఫోటోలు మూమూలుగా లేవుగా..!

Actress Poorna : అందాల ముద్దుగుమ్మ నటి పూర్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. యూఏఈకి చెందిన ఓ బడా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందట.. కేరళలో వీరిద్దరు ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. ఎంగేజ్మెంట్లో పూర్ణ వైట్ డ్రెస్‌లో చందమామలా మెరిసిపోతోంది. తన అందాలతో కుర్రకారు మతులు పొగడుతోంది. మరోపక్క బుల్లితెరపై షో లకు జడ్జిగా కూడా పూర్ణ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పూర్ణ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కి గట్టి షాక్ ఇచ్చింది. యూఏఈకి చెందిన అసిఫ్ అలీనీ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె స్వయంగా ప్రకటించింది.

Actress Poorna gets engaged UAE-based Businessman, Photos Viral
Actress Poorna gets engaged UAE-based Businessman, Photos Viral

పూర్ణ కాబోయే భర్త అసిఫ్ అలీ జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సీఈవో, ఫౌండర్ అన్న సంగతి తెలిసిందే. జమా మెహరి అనే సంస్థను స్థాపించిన ఆయన.. ఆ సంస్థ ద్వారా వీసాలను అందిస్తుంటాడు. ఫ్లైట్ టికెట్ వంటి సర్వీసులను కూడా ఈ సంస్థ ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఇతను కాజల్, ప్రియమణి, విజయ్ సేతుపతి వంటి సెలబ్రిటీలకు కూడా వీసాలను ఏర్పాటు చేశాడు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim)

పూర్ణ సినీ కెరీర్ విషయానికి వస్తే.. అల్లరి నరేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన సీమటపాకాయ్, అవును శ్రీ మహా లక్ష్మి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఈ బ్యూటీ బాగా దగ్గరయింది. కానీ, ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో పెద్దగా రాణించలేకపోయింది. హీరోయిన్‌గా ఎక్కువగా అవకాశాలు రాకపోయినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అఖండ దృశ్యం టు వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది పూర్ణ. సినిమా అవకాశాలు తగ్గినా ఈ అమ్మడు బుల్లితెరపై షోలకు జడ్జిగా సెటిల్ అయిపోయింది.

Advertisement

Read Also : Jabardasth Rithu Chowdary : త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న రీతూ చౌదరి.. జబర్దస్త్ లేడీ కమెడియన్ కాబోయే భర్త ఇతడే…!!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel