Astrology: జూలై 10 తర్వాత ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..అందులో మీరు కూడా ఉన్నారేమో చూడండి?

Astrology: మన హిందూ క్యాలెండర్ ప్రకారం చాతుర్మాసం ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. జూలై 10 వ తేదీ నుంచి ఈ మాసం ప్రారంభం కానుంది.చాతుర్మాస సమయంలో, విష్ణువు దేవశయని ఏకాదశి నుండి యోగ నిద్రలోకి వెళ్తారు. ఇకపోతే చాతుర్మాసంలో విష్ణు దేవుడికి ప్రీతి కరం కనుక చాతుర్మాసంలో ఐదు రాశులపై విష్ణువు ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. ఆ రాశులు ఏంటో తెలుసుకోండి.

మేషం: మేష రాశి వారికి చాతుర్మాసం ఎంతో శుభప్రదమైనది. ఈ మాసంలో మీరు ఏ పని చేపట్టిన మంచి విజయం సాధిస్తారు. ఈ రాశి వారు ఈ నెలలో విష్ణు దేవుడని పూజిస్తూ స్వామి వారికి నెయ్యి దీపం పెట్టి పూజ చేయడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

this-zodiac-signs-people-after-july-10-has-lot-of-luck
this-zodiac-signs-people-after-july-10-has-lot-of-luck

వృషభం: వృషభ రాశి వారికి జులై 10వ తేదీ నుంచి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ప్రమోషన్లు, వ్యాపారులకు ఆకస్మిక ధన లాభం పొందుతారు. ఇక ఈ నెలలో వృషభ రాశి వారు పేదలకు దానధర్మం చేయటం వల్ల మరింత ఫలితాలను పొందుతారు.

Advertisement

మిధునం: మిధున రాశి వారికి ఈ మాసం ఎంతో లాభదాయకంగా ఉంది. ఈ రాశి వారు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే మరి కొంతకాలం వేచి ఉండాలి. అయితే ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఇక ఈ నెలలో విష్ణు దేవుడి ప్రసన్నం చేసుకోవడం కోసం మిధున రాశి వారు ఆవుకి చపాతి పెట్టడం వల్ల విష్ణు దేవుడి ఆశీస్సులు ఉంటాయి.

కర్కాటకం: కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉంది. ఈ రాశుల వారు వ్యాపారాలు చేస్తుంటే వ్యాపారాలలో అధిక లాభాలను పొందుతారు.
చాతుర్మాసంలో శ్రీ రామచరిత్ మానస్ పారాయణం చేయడం ప్రయోజనకరం.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు ఈ మాసంలో విష్ణు దేవుడు అనుగ్రహం పొందాలంటే పక్షులకు ఆహారం దానం ఇవ్వాలి. వ్యాపారాలలో ఆర్థిక పరమైన లాభాలను అందుకుంటారు. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel