
సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదయ్ కిరణ్..
తెలుగులో ఉదయ్ కిరణ్ సినీ జీవితం కొంచం స్లో అవటంతో తమిళ భాషలో కూడా “పోయ్” అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా “అబద్దం ” అనే పేరుతో తెలుగులో కూడా రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. అంతే కాకుండా బాలకృష స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ” నర్తనశాల ” అనే సినిమాలో కూడా అభిమన్యు పాత్రలో నటించాడు. కానీ సౌందర్య చనిపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఉదయ్ కిరణ్, త్రిష జంటగా ఒక హింది రీమేక్ సినిమాలో నటించాల్సి ఉంది. కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఇలా ఉదయ్ కిరణ్ నటించాల్సిన ఇంకో మూడు సినిమాలు కూడా ఆగిపోయాయి.
Read Also : Uday Kiran : నటుడు ఉదయ్ కిరణ్ డెత్ సీక్రెట్ ఏంటి.. ఆయన మరణం వెనుక ఏం జరిగిందంటే?
Our website is made possible by displaying online advertisements to our visitors. Please consider supporting us by disabling your ad blocker.