Ariyana glory : బిగ్ బాస్ షో.. ఎంత మంది వ్యతిరేకించినా, మరెంత మంది దానిని తిట్టి పోసినా కూడా అదే రియాల్టీ గేమ్ షోల్లో నంబర్ వన్ అని చెప్పాలి. మరే ప్రోగ్రాం కూడా దాని దరిదాపుల్లోకి రావడం లేదు మరి. ఓటీటీలో వచ్చిన ఈ సీజన్ కొంత ఫ్లాప్ టాక్ అందుకున్నప్పటికీ.. మిగతా ప్రోగ్రాములతో పోలిస్తే ఇంకా ఇదే టాప్ లో కొనసాగుతోంది.
ఇక ఈ షోకు వచ్చిన చాలా మంది తమ క్రేజ్ ను పెంచుకున్నారు. తమకున్న ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఈ రియాలిటీ షోకి ఉన్ క్రేజే వేరు. చాలా మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ షోకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపించరు. అప్పుడప్పుడే ఎదుగుతున్న వారు, సమాజంలో తమకూ కొంత ఫాలోయింగ్ కావాలనుకునే వారు, తమను బయట గుర్తించాలని కోరుకునే వారు మాత్రమే బిగ్ బాస్ తలుపు తడతారు.
ఇక ఇటీవల ముగిసిన బిగ్ బాస్ ఓటీటీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న మిత్రా శర్మపై అరియానా గ్లోరి ప్రశంసలు కురిపించింది. హౌస్ లో ఉన్నప్పుడు ఎడమొహం పెడమొహం మాదిరిగా ఉండే ఈ ఇద్దరి మధ్య అంతగా బాండింగ్ అయితే లేదనే చెప్పాలి. ఒక్కోసారి కలిసి ఉన్నట్టుగా కనిపించినా, ఎవరి దారి వారిదే. అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మిత్రా టాలెంట్ ఏంటో తెలిసిందని అంటుంది అరియానా. ఆమె మెచ్యూరిటీ చూసి షాక్ కు గురి అయ్యాయని చెబుతోంది అరియానా. తాజాగా యాంకర్ శివకి ఇచ్చిన ఇంటర్య్వూలో మిత్రా శర్మపై అరియానా ప్రశంసలు కురిపించింది.
Read Also : Anasuya in bigg boss : బిగ్ బాస్ సీజన్ 6లో అనసూయ..? ఎంత అడిగిందంటే?