Chor Bazaar Movie Review : డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. మెహబూబా, ఆంధ్రా పూరీ, రొమాంటిక్ మూడు మూవీల్లో ఆకాశ్ పూరీ హీరోగా నటించినా మంచి హిట్ పడలేదు. ఇప్పుడు మరో చోర్ బజార్ అంటూ కొత్త మూవీతో వస్తున్నాడు. జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా ఆకాష్ పూరీ చోర్ బజార్ మూవీ రిలీజ్ అయింది. తండ్రిగా పూరి జగన్నాథ్ సపోర్టు లేకుండానే ఆకాశ్ పూరీ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. చోర్ బజార్ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. చోర్ బజార్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనే చెప్పాలి. చోర్ బజార్ ఏంటి? అసలు కథాంశం ఏంటి అనేది రివ్యూ చూసేద్దాం..
స్టోరీ ఏంటంటే? :
ఈ మూవీలో ఆకాష్ పూరి క్యారెక్టర్ బచ్చన్ పాండే.. పోకరి కుర్రాడు. పొట్టకూటి కోసం అతడు కార్ల టైర్లను విప్పి విక్రయిస్తుంటాడు. అలాంటి సమయంలో అతడు ఒక మూగ అమ్మాయిని కలుసుకుంటాడు. ఆ క్రమంలోనే బచ్చన్ పాండే వజ్రం దొంగిలిస్తాడు. అప్పటినుంచి అతడి లైఫ్ టర్న్ అవుతుంది. అలా సాగే కథలో చివరికి ఏమైంది? ఇంతకీ క్లైమాక్స్ ఎలా ఎండ్ అవుతుందో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..
మూవీ నటీనటులు వీరే :
ఆకాష్ పూరి, గెహెన్నా సిప్పీ, సునీల్, సంపూర్ణేష్‌బాబు సుబ్బర్జు నటించారు. ఈ చిత్రానికి బి.జీవన్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఛాయాగ్రహణం జగదీష్ చీకాటి అందించగా.. సంగీతాన్ని సురేష్ బొబ్బిలి అందించారు. ఇక నేపథ్య సంగీతాన్ని ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం అందించారు. V ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి.ఎస్.రాజు నిర్మించారు.
Chor Bazaar Movie Review : చోర్ బజార్ ఎలా ఉందంటే?
చోర్ బజార్ మూవీ.. మొదటి నుంచి చివరి వరకూ భిన్నంగా ఉంది. హీరో ఇంట్రెడక్షన్ నుంచి మొదలై చాలా క్యారెక్టర్లతో కలిసి ముందుకు సాగుతుంది. అయితే ఇందులో దర్శకుడు కాంప్లిక్ట్ అనేది చెప్పలేదు. అసలు స్టోరీ పాయింట్ నుంచి కథ ఏటో వెళ్లిపోయినట్టుగా అనిపించింది. హీరోయిన్ లవ్ ట్రాక్ మారిపోవడం కొంచెం కనెక్టింగ్ అనిపించలేదనిపిస్తుంది. ఖరీదైన వజ్రాన్ని దొంగిలించడం అనేది కొత్తగా చూపించినా.. అంతగా ఆకట్టుకునేలా లేదనే చెప్పాలి. మూవీ ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించింది. సెకండ్ హాఫ్ మధ్యమధ్యలో ఎమోషన్స్‌తో సాగిపోయింది. సినిమా స్ర్కీన్‌ప్లే కొంతమేరకు వర్కవుట్ అయినట్టుగానే అనిపించింది. బచ్చన్ పాండేగా ఆకాష్ తనలోని నటనను బయటకు తీశాడు.
పూరీ తనయుడిగా తన మార్క్ చూపించాడు. చోర్ బజార్ మూవీ లాంటి రోల్స చేసేంత అనుభవం లేకపోవడం ఒకరకంగా ఆకాష్ సాహసమనే చెప్పాలి. ఈ మూవీలో ఇతర నటీనటులు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. డైరెక్టర్ జీవన్ రెడ్డి జార్జ్ రెడ్డితో పాపులర్ అయ్యాడు. ఇందులో అతని మార్క్ పెద్దగా కనిపించినట్టు లేదు. టెక్నికల్‌గా చోర్ బజార్ బాగుందనే చెప్పాలి. జగదీష్ చెకటి సినిమాటోగ్రఫీ రెగ్యులర్ కమర్షియల్ మూవీల్లో చూసినట్టుగానే అనిపించింది. సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదనిపించింది. మొత్తం మీద చోర్ బజార్ ఒక న్యూ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెప్పవచ్చు. థియేటర్లలో మూవీ చూస్తేనే బాగుంటుంది.
చోర్ బజార్ మూవీ :
రివ్యూ : రేటింగ్: 3.5/5
Read Also : Virata Parvam Movie Review : ‘విరాట పర్వం’ మూవీ ఫుల్ రివ్యూ.. సినిమాకు ఇదే హైలెట్..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world