Karthika Deepam june 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ లో సౌందర్య ఇంటికి స్వప్న, నిరుపమ్ వస్తారు.
ఈరోజు ఎపిసోడ్ లో స్వప్న హిమ గురించి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉండగా అప్పుడు సౌందర్య స్వప్న ని నువ్వు మారవా అని అరుస్తుంది. అందుకే ఈ పెళ్ళి వద్దు అన్నాను. చూసావా నిరుపమ్ పెళ్లి కాకముందే హిమ నన్ను ఎలా మాట్లాడుతుందో, ఏదైనా అనాలి అనుకుంటే బాగాలేదు అన్న సానుభూతి అనగా వెంటనే హిమ మీ సానుభూతి ఇక్కడ ఎవరూ కోరుకోవడం లేదు అత్తయ్య అంటూ స్వప్నకు ఎదురు సమాధానం ఇస్తుంది.

అలా వారిద్దరూ కాసేపు గొడవ పడిన తర్వాత స్వప్న కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వెంటనే నిరుపమ్ కూడా స్వప్న తోపాటు వెళ్ళిపోతాడు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత సౌందర్య,హిమ ను క్యాన్సర్ విషయంలో ఎందుకు అబద్దం చెప్పావు అని నిలదీస్తూ ఉంటుంది. దీంతో హిమ నాకు శౌర్య ఎవరు ఎక్కడ ఉందో తెలుసు అని అనడంతో సౌందర్య,ఆనంద్ రావు ఒక్క సారిగా షాక్ అవుతారు.
ఆ తర్వాత సౌందర్య ఇప్పుడే సౌర్య దగ్గరికి వెళ్దాం పద అని చెప్పి హిమ ను తీసుకుని వెళ్తుంది. మరొక వైపు జ్వాలా అనాధాశ్రమంలో నిరుపమ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి నిరుపమ్ రావడంతోనే వెంటనే మీద మీద ప్రశ్నలు వేస్తుంది జ్వాలా. ప్రేమ గురించి మాట్లాడండి ఏదైనా చెప్పండి అని జ్వాలా అడగగా వెంటనే నిరుపమ్ సీరియస్ అవుతూ నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి జ్వాలా అంటూ జ్వాలా పై మండి పడతాడు.
నా మనసులో నువ్వు ఉన్నావ్ అని నీకు ఎవరు చెప్పారు నా మనసులో నువ్వు లేవు. నేను మీ తింగరిని పెళ్లి చేసుకుంటాను అని అనడంతో జ్వాలా షాక్ అవుతుంది. అప్పుడు సౌందర్య,హిమ వారి మాటలను చాటుగా నిలబడి వింటూ ఉంటారు. అప్పుడు సౌందర్య ఎందుకు నిరుపమ్ ఇలా మాట్లాడుతున్నాడు అని అనగా వెంటనే హిమ ఆ అమ్మాయే మన సౌర్య అని చెప్పడంతో సౌందర్య ఆనందపడుతుంది.
నిరుపమ్ మాత్రం తన మాటలతో జ్వాలా మనసును ముక్కలు చేస్తాడు. అప్పుడు జ్వాలా ఎమోషనల్ అవుతూ నిరుపమ్ కాలర్ పట్టుకుని నిలదీయగా నిరుపమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. నువ్వు ఆ తింగరి ఇద్దరు మోసమే అని జ్వాలా అనడంతో నిరుపమ్ అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతాడు. రేపటి ఎపిసోడ్ లో జ్వాలా నిరుపమ్ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధ పడుతూ ఉండగా ఇంతలో అక్కడికి సౌందర్య వెళ్ళి జ్వాలాని హత్తుకొని ఎమోషనల్ అవుతుంది.
Read Also : Karthika Deepam : శోభకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హిమ.. స్వప్నపై విరుచుకుపడిన హిమ..?
- Karthika Deepam july 21 Today Episode : నిరుపమ్ ఫోన్ ని తిరిగిచ్చేసిన సౌర్య.. సౌర్య,నిరుపమ్ ని కలిపే ప్రయత్నంలో ప్రేమ్..?
- Karthika Deepam Dec 27 Today Episode : హిమ బాధను చూసి కుమిలిపోతున్న దీప.. దీపను చంపడానికి మరొక ప్లాన్ వేసిన చారుశీల?
- Karthika Deepam july 22 Today Episode : హిమ పై మండిపడ్డ సౌర్య.. నిరుపమ్, సౌర్య కోసం ఒక్కటైనా ప్రేమ్, హిమ..?















