Devatha june 16 today episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో భాష,ఆదిత్య, కమల ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య తన మేనత్త ను ఇంట్లో నుంచి బయటకు పంపించినందుకు బాష పొగుడుతూ మీరు చాలా మంచి పని చేశారు పటేలా అని అంటాడు. అప్పుడు ఆదిత్య పెద్దవాళ్లు అంటే మంచి పని చేయాలి కానీ ఇలా తప్పుడు సలహాలు ఇవ్వకూడదు అందుకే అలా చేశాను అని అంటాడు.
వెంటనే కమల మా చెల్లెలి చనిపోయి ఏ లోకంలో ఉందో కానీ ఇది కనుక తాను చూస్తే చాలా సంతోషపడుతుంది అని అనడంతో వెంటనే ఆదిత్య మీ చెల్లెలు చనిపోలేదు ఇంకా బతికే ఉంది అని మనసులో అనుకుంటాడు. ఆ తరువాత సడన్ గా ఆదిత్య కార్ వేసుకుని రాధ దగ్గరికి వెళ్తాడు.
అప్పుడు రాదా నేను మాట్లాడుతున్న మాటలు అన్నీ జాగ్రత్తగా విను పెనిమిటి. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు నా మనసు విప్పి మాట్లాడుతున్నాను అని అంటుంది. నాకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు. మన బిడ్డ ఆ మాధవ్ సార్ ని నాయనా అని పిలిచినప్పుడల్లా నాకు చాలా బాధగా అనిపిస్తుంది.
నువ్వు కనిపించిన తరువాత కూడా దేవి అలాగే పిలుస్తూ ఉన్న నేను ఏమి చేయలేక పోతున్నాను నా మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది అని అంటుంది రాద. నువ్వు ఇక్కడే ఉన్నావు అని తెలిసిన తర్వాత ఎంతో బాధను అనుభవించాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను అని అంటుంది.
అప్పుడు ఆదిత్య రుక్మిణి ఏడవద్దు అని చెప్పి ధైర్యం చెబుతాడు. మరొకవైపు దేవుడమ్మ రాధ కోసం దీక్ష మొదలు పెడుతుంది. నా కోడలు ఎక్కడ ఉన్నా కూడా నా దగ్గరికి చేర్చు దేవుడా అని దేవుడిని ప్రార్థిస్తుంది. దేవుడమ్మ, మరిది బయలుదేరుతూ ఉండగా కమలా భాష ఎదురు ఎదురు వస్తారు.
అప్పుడు దేవుడమ్మ గర్భవతి ఎదురు వచ్చింది పోయిన పైనే అంతా సక్రమంగా జరుగుతుంది అని సంతోషపడుతుంది. ఎలా అయినా మనకు రుక్మిని దొరుకుతుంది అని అనడంతో సత్య, కమల, భాష ముగ్గురు షాక్ అవుతారు. వారు ముగ్గురూ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా దేవుడమ్మ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
మరొకవైపు భాగ్యమ్మ దేవి ని చూడడం కోసం స్కూల్ దగ్గర కాయలు అమ్ముతూ ఉంటుంది. ఇంతలోనే రాధ ఇద్దరు పిల్లలు స్కూల్ కి వస్తారు. అక్కడ భాగ్యమ్మ దేవిని చూసి ఆనంద పడుతుంది. మీ కోసమే కాయలు తెచ్చాను అని జామకాయలు ఇస్తూ ఉండగా మా దగ్గర డబ్బులు లేవు అని అనడంతో డబ్బులు ఎవరికి కావాలి అని చెప్పి ఇచ్చి సంతోష పడుతుంది.
ఇది రేపటి ఎపిసోడ్ లో దేవి ఆదిత్య తో కలిసి మాట్లాడుతూ ఉండగా మాధవ అక్కడికి దేవి అని పిలవడంతో దేవి మా నాన్న వచ్చాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆదిత్య బాధ గా ఫీల్ అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha june 15 today episode : చిన్మయి గురించి బాధ పడుతున్న రాధ.. సత్యం నిలదీసిన ఆదిత్య..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World