...

Sugar control : మధుమేహులకు దివ్యౌషధంగా పనిచేసే చెర్రీస్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Sugar control : మధుమేహ వ్యాధి గ్రస్తులు డైట్ ను కచ్చితంగా పాటించాల్సిందే. లేదంటే ఎన్ని సమస్యలు వస్తాయో చెప్పాల్సిన పని లేదు. అయితే ఆహారంలో తక్కువ గైసెమిక్ ఇండెక్స్ ఉన్న అహారాలు చక్కెర నియంత్రణలో ఉన్న వాటిని తీసుకోవడం ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఈ పండ్లు డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగపడతాయని ఆరోగ్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కానీ దీని జ్యూస్ మాత్రం అస్సలే మంచిది కాదట. ఎండా కాలంలో షుగర్ నియంత్రణ కోసం చెర్రీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఎర్రటి చెర్రీలు ఎంత అందంగా కనిపిస్తాయో అంతే రుచిగా కూడా ఉంటాయి. చెర్రీ అనేది శృంగార పండ్లలో ఒకటిగా పరిగణించబడే పోషకాలతో కూడిన పండు.

Sugar control
Sugar control

ఇందులో శరీరానికి మేలు చేసే థయామిన్, రిబోప్లావిన్, విటామిన్ బి, ఎ, సి, కే, ఇ, బి6, పాంటోథెనిక్ యాసిడ్, నియాసిన్, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటయి. వేసవిలో చెర్రీస్ తినడం వల్ల అనేక రకాల వ్యాధులు నయం అవుతాయి. అలాగే చెర్రీస్ కు గుండె జబ్బులు, క్యాన్సర్, ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయని తేలింది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పూట చెర్రీస్ తింటే హాయిగా నిద్ర పోవచ్చు. అలాగే మలబద్ధకం వంటి సమస్యలకు కూడా చెర్రీస్ చెక్ పెడతాయి.

Read Also : Tips for black hair: తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా.. అయితే ఈ రసాన్ని రాయాల్సిందే!