...

Nirjala Ekadashi: నిర్జల ఏకాదశి రోజు ఈ వస్తువులు దానం చేస్తే ఆ లక్ష్మీ నారాయణడి అనుగ్రహం మనపైనే?

Nirjala Ekadashi: మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఒక ఏకాదశి కృష్ణపక్షంలోను మరొక ఏకాదశి శుక్లపక్షంలో వస్తుంది. ఇకపోతే జేష్ఠ మాసం శుక్లపక్ష ఏకాదశి జూన్ 10వ తేదీ వచ్చింది. ఈ ఏకాదశి రోజున భక్తులు పెద్ద ఎత్తున కటిన ఉపవాసంతో లక్ష్మీనారాయణ వ్రతం ఆచరిస్తారు.ఇక ఈ ఏకాదశి రోజు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా వ్రతం ఆచరిస్తారు కనుక ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఇకపోతే ఈ రోజు చేసే వ్రతం నిర్జల ఏకాదశి వ్రతం అని పిలుస్తారు.

Advertisement

ఈ ఏకాదశి నారాయణుడికి అంకితం చేస్తారు అందుకే ఈ ఏకాదశి రోజు కటిన ఉపవాసంతో లక్ష్మీనారాయణ వ్రతం ఆచరించడం వల్ల ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండే సకల సంపదలతో పాటు అష్టైశ్వర్యాలను కలిగిస్తారు. మన దుఃఖాలను బాధలను దూరం చేసే ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఎంతో పవిత్రంగా ఆచరించాలి. ఇకపోతే ఈ ఏడాది ఏకాదశి వ్రతం జూన్ 10వ తేదీ శుక్రవారం ఉదయం 7:25 గంటలకు ప్రారంభమయ్యే జూన్ 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఏకాదశి ఉంటుంది.

Advertisement

జేష్ట మాసం మండుటెండలు ఒక రోజు మొత్తం నీటిని కూడా సేవించకుండా లక్ష్మీనారాయణ ఏకాదశి వ్రతం ఆచరించాలంటే ఎంతో కష్టతరమైనది. అందుకే ఏకాదశీ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారిపై ఆ లక్ష్మీ నారాయణుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఇకపోతే నిర్జల ఏకాదశి వ్రతం ఆచరించిన తర్వాత దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలం కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి వేసవి కాలంలో వస్తుంది కనుక నీళ్ళు కలిగిన పండ్లను దానం చేయడం ఎంతో మంచిది. అదేవిధంగా గొడుగు, చెప్పులు, దుస్తులు మొదలైన వాటిని నేడు దానం చేయటం వల్ల ఆ శ్రీహరి అనుగ్రహం మనపై ఉంటుంది.

Advertisement
Advertisement