Intinti Gruhalakshmi: తులసిని దారుణంగా అవమానించిన అభి.. శ్రుతిని చూసి షాక్ అయిన అంకిత,తులసి..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

గత ఎపిసోడ్ లో శృతి తాను పనిచేసే చోట ఉన్న దగ్గర ఒక ఐదు లక్షలు అప్పు అడుగుతుంది. అప్పుడు అతను నువ్వు చేసే పదివేల జీవితానికి నాకు ఎప్పుడు తీరుస్తావు అన్ని మాటలు అని అవమాన పరుస్తాడు. మరొకవైపు ప్రేమ్ కూడా ఐదు లక్షలు అప్పు కావాలి అని అడగడంతో అతను మ్యూజిక్ డైరెక్టర్ తో మాట్లాడించు అప్పుడు చూద్దాం అని అనడంతో ప్రేమ్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు.

Advertisement

మరొక వైపు పరంధామయ్య యంగ్ గా గెటప్ వేసి తులసి, దివ్య,అనసూయల ముందు చిందులు వేస్తూ ఉంటాడు. అప్పుడు అనసూయ వెటకారంగా మాట్లాడుతూ ఉండగా తులసి దివ్య వాళ్ళు నవ్వుతూ ఉంటారు. నా కూతురు చాలా గ్రేట్ నా కొడుకు ప్రేమ్ కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని పొగుడుతుంది.

Advertisement

ఆ తర్వాత నా కొడుకు అభి అని అభి గురించి చెబుతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన అభి పనికిరాని చవట వేస్ట్ ఫెలో అని తనని తానే తిట్టుకున్నాడు. అప్పుడు వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అప్పుడు అభి కోపం అంతా తులసి పై చూపిస్తూ తులసిని నానారకాలుగా మాటలు అని బాధ పెడతాడు.

అప్పుడు తులసి అలా మాట్లాడకు అని అంటూ ఉండగా ఇంతలో పరంధామయ్య దంపతులు ఏమీ అర్థం కాక పోవడంతో ఏం జరిగింది అని అడగగా అప్పుడు అది అందరికీ చెప్పి వీళ్ళకు చెప్పలేదా అని తులసిని వెటకారంగా మాట్లాడుతాడు. నాకు రావాల్సిన ఆస్తిని రాకుండా చేసింది అని కోపంతో రగిలిపోతాడు అభి. ఆ మాటలు విని పరంధామయ్య దివ్య,అనసూయలు షాక్ అవుతారు.

Advertisement

డాడ్ చాలా మంచివాడు ఆయన అప్పుడు చెబుతుంటే నేను వినలేదు ఇప్పుడు నువ్వేంటో తెలిసింది ఎన్నో పెద్ద శకుని అని నానా మాటలు అనే తులసిని బాధపడతాడు. తులసి నీకోసమే చేశాను అని చెబుతున్నా వినకుండా అభి మరింత రెచ్చిపోయి తిట్టి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అప్పుడు పరంధామయ్య దంపతులు నీకు బాధగా లేదా అని తులసిని అడగగా అప్పుడు తులసి ఇప్పుడు అభి నన్ను తప్పుపట్టిన పర్లేదు కానీ వారు తప్పు దారిలో పడకూడదు అని అంటుంది తులసి.

మరొకవైపు లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే అభి అక్కడికి వచ్చి తులసి గురించి మరింత నెగిటివ్ గా చెబుతాడు. అంతేకాకుండా అంకిత పేరు మీద ఉంటే నా పేరు మీద ఉన్నట్లే కదా నేను అడిగీ మీ పెట్టుబడి డబ్బు తీసుకుని వస్తాను అని చెప్పి వారిద్దరికి మాట ఇస్తాడు. అప్పుడు నందు గొడవలు జరుగుతాయి ఏమో అని అనగా లాస్య అలా కాకుండా అభి చూసుకుంటాడు లే అని ధైర్యం చెప్పి దొంగ ప్రేమ కురిపిస్తుంది. మరొకవైపు శృతి చెత్త పారేయడానికి బయటికి రావడంతో అదే సమయంలో అక్కడికి తులసి, మిగతావాళ్లు వస్తూ ఉంటారు. శృతి ని చూసి ఒక్క సారిగా షాక్ అవుతారు.

Advertisement