TS Police Jobs : అలర్ట్….మరి కొన్ని గంటలలో ముగియనున్న పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు!

Updated on: May 26, 2022

TS Police Jobs : తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల పోస్టులను భర్తీ చేయడం కోసం తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మే 20 వ తేదీన చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి.అయితే నిరుద్యోగ అభ్యర్థుల వినతుల ప్రకారం మరో రెండు సంవత్సరాల పాటు వయో పరిమితిని పెంచుతూ ఈ నెల 26 వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం కూడా పెంచారు. ఈ క్రమంలోనే 26వ తేదీ రాత్రి పది గంటల వరకు దరఖాస్తులను తీసుకోనున్నారు.

TS Police Jobs
TS Police Jobs

దరఖాస్తుల స్వీకరణకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.మరి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి వస్తే…

* అభ్యర్థులు ముందుగా https://www.tslprb.in/ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ కావాలి. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే కుడివైపు అప్లై ఆన్లైన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Advertisement

*అప్లై ఆన్లైన్ బటన్ పై క్లిక్ చేయగానే Have you already Registered ? అని ఉంటుంది మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారు అయితే నో అని ప్రెస్ చేయాలి.

*అనంతరం రిజిస్ట్రేషన్కు సంబంధించిన సమాచారం కనబడుతుంది అందులో మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని సబ్మిట్ బటన్ నొక్కాలి.

*అనంతరం మీ ఫోన్ నెంబర్ కు ఓటీఈ వ‌స్తుంది. అది స‌బ్‌మిట్ చేసి ధ్రువీక‌రించుకోవాలి. ఆతరువాత మొబైల్ నెంబర్ పాస్‌వ‌ర్డ్ సెట్ చేసుకొని సైన్ ఇన్ కావాలి.

Advertisement

*ఆ తర్వాత మీరు ఏ ఉద్యోగానికి అయితే దరఖాస్తు చేసుకున్నారు ఆ విభాగాన్ని ఎంచుకోవాలి. అనంతరం దరఖాస్తు రుసుం చెల్లించాలి.

*పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాత కుటుంబం, కమ్యూనిటీ, చిరునామా వంటి వివరాలను తప్పు లేకుండా సబ్మిట్ చేయాలి. అనంతరం అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటే మీరు దరఖాస్తు పూర్తి చేసినట్లే.

Read Also : TS Police Jobs Alert: పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారా… అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel