Karthika Deepam May 26 Today Episode : జ్వాలాపై కోపంతో రగిలిపోతున్న స్వప్న,శోభ.. గతాన్ని గుర్తు చేసుకున్న సౌందర్య..?

Updated on: May 26, 2022

Karthika Deepam May 26 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్ కోసం జ్వాలా భోజనం తీసుకొని వెళ్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా నాకు పెద్దలు అంటే చాలా గౌరవం అంటూ వెళ్లి స్వప్న కాళ్లు ముక్కు తున్నట్టుగా కిందికి ఒంగి అక్కడ కింద పడి ఉన్న డబ్బులు తీసి నిరుపమ్ కి ఇస్తుంది. అప్పుడు శోభ నా గురించి నీకు తెలియదు నేను చాలా డేంజర్ అని చెప్పగా నేను నీ కంటే డబ్బులు డేంజర్ అని అంటుంది జ్వాలా.

Karthika Deepam May 26 Today Episode
Karthika Deepam May 26 Today Episode

మరొకవైపు ప్రేమ్, హిమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హిమ తో తన ప్రేమ పెళ్లి విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి సత్య వచ్చి ఎందుకు అలా ఉన్నావు ఈ మధ్య సరిగా లేవు అంటూ ప్రేమ్ కి జాగ్రత్తలు చెబుతాడు. మరొకవైపు శోభ ఎలా అయినా సరే నిరుపమ్ పెళ్లి చేసుకోవాలి.

Advertisement

నా హాస్పిటల్ కోసం చేసిన అప్పు అంత ఇద్దరం కలిపి హ్యాపీ గా తీసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు ఇంద్రుడు ఫుల్ గా మందు తాగి రోడ్డుపై రచ్చ చేస్తూ ఉండగా అప్పుడు జ్వాలా ఇంద్రుడిని తన భుజాల మీద వేసుకొని తీసుకు వస్తూ ఉండగా ఇంతలో అక్కడకు సౌందర్య వచ్చి మీ బాబాయి ఇంతలా తాగి వస్తుంటే నీ కళ్ళలో కోపం కాకుండా ప్రేమ కనిపిస్తుంది ఏంటి అని అడుగుతుంది.

అప్పుడు జ్వాలా చెప్పిన సమాధానానికి సౌందర్య తన కొడుకు కార్తీక్ గతంలో తాగిన విషయాన్ని గుర్తు చేసుకొని నా గుండెను తాకావ్ బంగారం అంటూ ముద్దు పెట్టుకుంటుంది. ఆ తర్వాత శోభ,నిరుపమ్ తో మాట్లాడుతూ నువ్వు వేరే అమ్మాయితో హిమ ముందు క్లోజ్ గా ఉండు అప్పుడు హిమ తన ప్రేమను బయటపెట్టని అని సలహా ఇస్తుంది.

ఇంతలో అక్కడికి జ్వాలా రావడంతో కోపంతో రగిలిపోతుంది శోభ. ఇక నిరుపమ్ తనతో ప్రేమగా ఉంటాడు అనుకుంటే జ్వాలతో క్లోజ్ గా ఉంటున్నాడు ఏంటి అనుకుని ఆ విషయాన్ని అంతా వెళ్లి స్వప్న కు వివరిస్తుంది. అప్పుడు స్వప్న,శోభ ఇద్దరు జ్వాలా గురించి ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో జ్వాలా,నిరుపమ్ ఇద్దరూ రెస్టారెంట్ కి వెళ్ళి పక్క పక్కనే కూర్చున్నారు. ఇంతలోనే అక్కడికి హిమ వస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Karthika Deepam MAY 25 Today Episode : నిరుపమ్ చేసిన పనికి షాక్ అయిన శోభ.. ఆనందంలో హిమ..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel