Samantha : అవి గుర్తొస్తే సామ్ కు నవ్వొస్తుందట.. ఎవరి గురించో తెలుసా?

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల నటి సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె తన అందం, అభినయంతో తెలుగు చిత్ర సీమలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు… ఇలా ప్రతీ విషయంలో ఆమె వార్తల్లో నిలిచారు. అయితే విడాకుల తర్వాత అయితే మరింత ఎక్కువగా వ్తున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు… వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ చాలా బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా వస్తున్న ఖుషీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతోంది. అయితే వీరిద్దరి కలిసి ఇప్పటికే మహానటి సినిమాలో ప్రముఖ పాత్రల్లో నటించి మెప్పించారు. మరోసారి వీరిద్దరూ జత కట్టి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్నారు.

Samantha
Samantha

అయితే ఈ సినిమాను తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కశ్మీర్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా… ఆ ఫొటోలను సామ్ ఎప్పటికప్పుడు అభిమానలతో పంచుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కశ్మీరి అందాలపై ఓ పోస్టు పెట్టింది. అక్కడ జరిగిన సన్ని వేషాలు గుర్తొస్తే చాలా నవ్వొస్తుందని తెలిపింది. అయితే ఈ సినిమాలో సామ్ సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపిస్తుండగా… విజయ్ స్టైలిష్ అబ్బాయిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

Read Also : Samantha new movie: వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న సామ్.. మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel