Nuvvu nenu prema : చాలా మంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. ఒకరిన చూడగానే మనకు కల్గిన అభిప్రాయమే జీవితాంతం ఉంటుందని చెప్తుంటారు. అందుకే మొదటి చూపులో ఇష్టపడ్డ వారి మధ్య ప్రేమ ఏర్పడి చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని. సాధారణంగా అయితే ఇదే జరగాలి. కానీ అస్సలు ఇష్టపడే ఛాన్సే లేని అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? ఈ విభిన్న కథాంశంతో స్టార్ మాలో రాబోతున్న సరికొత్త సీరియల్. దీని పేరు నువ్వు నేను ప్రేమ. అయితే ఇద్దరి మధ్య శత్రుత్వం సంధించే చాలా కష్టమైన ప్రశ్నలకు అర్థవంతమైన సమాధానాలు ఇవ్వబోతోంది ఈ సీరియల్.
జీవితాన్ని ఆసవాదించాలి అనుకునే అమ్మాయి. జీవితం అంటే డబ్బు సంపాదించడమే అను అబ్బాయికి మధ్య ఓ బంధం ఏర్పడితే వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయన్నదే ఈ కథ. విభిన్మమైన మనస్తత్వాల మధ్య మొదలయ్యే సంఘర్షణ ఎటు దారి తీస్తుందో ఈ కథలో మనం చూడొచ్చు. అయితే ఈరోజు సాయంత్రం 6.30 నిమిషాలకు స్టార్ మాలో ప్రారంభం కానుందీ ఈ సీరియల్. సోమవారం నుంచి శని వారం వరకు బ్రాడ్ కాస్ట్ కాబోతుంది.
Read Also :Ariyana: గ్రాండ్ ఫినాలేలో అరియాన చేసిన పనికి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..!