...

LPG Gas cylinder subsidy : వంట గ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. వాళ్లకు మాత్రమే!

LPG Gas cylinder subsidy : దేశీయ చమురు కంపెనీ సామాన్య ప్రజలకు ఇటీవల వరుసగా షాక్ లు ఇచ్చింది. సిలిండర్ ధరలను పెంచుతూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కొందరికి మాత్రమే అని షరతులు విధించింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన యొక్క 9 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ కు 12 సిలిండర్ల వరకు రూ. 200 సబ్సిడీని అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇది దేశంలో ఎందరో మహిళలకు సాయం చేస్తుందని ఆమె వివరించారు.

LPG Gas cylinder subsidy
LPG Gas cylinder subsidy

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు సహా నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరుగుతున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి వరుసగా ఎగబాకుతుండటంతో సామన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దనపు భారం పడుతోందని తీవ్రంగా గగ్గోలు పెడుతున్నారు. ధరల నియంత్రణ దిశగా ప్రభుత్వాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరలో విషయంలో నిర్ణయం తీసుకున్నారు.

Read Also : LPG Gas cylinder subsidy: వంట గ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. వాళ్లకు మాత్రమే!