Y.S Sharmila Son: డల్లాస్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందిన వైయస్ రాజారెడ్డి.. గర్వంగా ఉందన్న షర్మిల!

Y.S Sharmila Son : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వైఎస్ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూతురు వర్షా రెడ్డి, హర్ష రెడ్డి చదువులో రాణిస్తూ వైయస్ కుటుంబానికి గర్వకారణంగా నిలిచారు. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల తానేమీ తక్కువ కాదంటూ ఉన్నత చదువుల్లో విజయాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైయస్ రాజారెడ్డి డిగ్రీ పట్టా తీసుకోవడంతో వైయస్ కుటుంబం సంతోషంలో ఉన్నారు.

Advertisement
y-s-sharmila-son-ys-rajareddy-graduated-from-the-university-of-dallas
y-s-sharmila-son-ys-rajareddy-graduated-from-the-university-of-dallas

అమెరికాలోని ప్రముఖ డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచ్లర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ పూర్తిచేసుకున్న వైయస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి ఈ యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీ నిర్వహించిన కాన్వకేషన్ కార్యక్రమానికి వైయస్ షర్మిల కుటుంబం మొత్తం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వైయస్ షర్మిల, తన భర్త అనిల్ కుమార్, కూతురు అంజలి రెడ్డితోపాటు వైయస్సార్ సతీమణి విజయమ్మ కూడా అమెరికా వెళ్లారు. ఈ క్రమంలోని యూనివర్సిటీ నుంచి పట్టా అందుకోవడంతో కుటుంబ సభ్యులు రాజారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

ఈ క్రమంలోనే తన కొడుకు ప్రముఖ యూనివర్సిటీ నుంచి పట్టా పొందడంతో షర్మిల భావోద్వేగమైన పోస్ట్ చేశారు.తన తాత పేరును తన కొడుక్కి పెట్టుకున్నప్పటికీ తన కొడుకుని మాత్రం నాన్న అని సంబోధిస్తూ.. పెద్ద వాడివై డిగ్రీ పొందిన పక్కవారిని గౌరవించడం మర్చిపోవద్దు. ముందుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు శుభాకాంక్షలని తెలియజేశారు. బుడిబుడి అడుగులు వేస్తూ నా చేతుల్లో పెరిగిన నువ్వు నేడు ఇంత ఎత్తుకు ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది.పెద్దవాళ్ళను గౌరవిస్తూ నీతి నిజాయితీతో ఉండు ఇతరుల ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం నీపై ఉంటుంది. చాలా గర్వంగా ఉంది నాన్నా అంటూ ఈమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం షర్మిల చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Advertisement

Read Also :Student interaction with cm jagan: ఆ పిల్లాడు ఐఏఎస్ అయ్యేదాకా.. జగనే సీఎంగా ఉండాలట!

Advertisement
Advertisement