Karthika Deepam: సౌర్య కోసం వెతుకుతున్న సౌందర్య.. విలన్ క్యారెక్టర్ ని చెంప చెల్లుమనిపించిన జ్వాలా..?

Karthika Deepam MAY 20 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా, సౌందర్య కి ఫోన్ చేసి నానమ్మ నేను సౌర్య ని గుర్తుపట్టావా అని అడుగుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య తనకు కాల్ చేసినందుకు సౌందర్య ఆనంద పడుతూ ఉంటుంది. సౌర్య ఎలా ఉన్నావ్ ఎక్కడ ఉన్నావ్ చొప్పున రౌడీ బేబీ అంటూ ఆనందపడుతుంది. అప్పుడు సౌర్య ఫోన్ కట్ చేయడంతో ఆనందంతో హిమ దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పగా హిమ షాక్ అవుతుంది.

Karthika Deepam
Karthika Deepam

ఇంతలోనే స్వప్న అక్కడికి రావడంతో స్వప్న కి ఆ విషయం చెబుతుంది సౌందర్య. అప్పుడు స్వప్న నా కొడుకులు వదిలేసి నీ మనవరాలు వెతికే ప్రయత్నం చెయ్యి, ఒకవేళ అది దొరికితే దాన్ని నా కొడుకుకు కట్టబెట్టాలని చూడొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

Advertisement

అప్పుడు హిమ ని మరొక సారి ట్రై చేయమని అడగగా,సౌర్య ఫోన్ స్విచ్ఆఫ్ చేస్తుంది. ఆ తరువాత సౌర్య గురించి సౌందర్య వెతుకుతూ పోలీసులను రంగంలోకి దింపుతుంది. ఇంతలో అక్కడికి జ్వాలా రావడంతో ఏంటి నువ్వు నేను ఎక్కడికి వెళితే ఎక్కడికి వస్తున్నావు అంటూ సౌర్య పై కోప్పడుతుంది.

మరొక వైపు హిమ, జ్వాలా కోసం తన ఇంటికి వెళ్లగా అక్కడ చంద్రమ్మ దంపతులు లెక్కల విషయంలో గొడవ పడుతూ ఉంటారు. ఆ తరువాత నిరుపమ్ ఒంటరిగా కూర్చుని హిమ గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి స్వప్న వచ్చి నీకు ఏమి అయింది రా దాని గురించి పదే పదే ఆలోచిస్తున్నావు.

నిన్ను వద్దు అనుకున్నందుకు అది జీవితాంతం బాధపడాలి అని చెప్పి ధైర్యం చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో హిమ, జ్వాలా రోడ్డుపై కారు ఆపి మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఒక అమ్మాయి వచ్చి హిమ ను కొడుతుంది. ఇక వెంటనే జ్వాలా ఆ అమ్మాయిని రెండుసార్లు కొడుతుంది.

Advertisement

నువ్వు ఎవరు నీ సంగతి ఏంటి నేను గెలుస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళుతుంది. మొత్తానికి కార్తీకదీపం సీరియల్ లో కి ఒక విలన్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Karate Kalyani: నువ్వు పతివ్రతవా…కరాటే కళ్యాణినిఏకిపారేసిన యాంకర్ శ్వేతారెడ్డి?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel