Shani Trayodashi: శని త్రయోదశి శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు.శని దేవుడు త్రయోదశి తిథి రోజున జన్మించడం వల్ల నేడు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఏలినాటిశని తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున శనీశ్వరుని ఆలయానికి చేరుకుని భక్తులు స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం నిర్వహించి అనంతరం దానధర్మాలు చేయడం వల్ల అన్ని శుభఫలితాలు కలుగుతాయని భావిస్తారు.
ఈ శని త్రయోదశి రోజు మనం ఉదయమే ఇంటిని శుభ్రం చేసుకుని పసుపుతో చిన్న పరిహారం చేయడం వల్ల ఏలినాటి దరిద్రం తొలగిపోయి లక్ష్మీకటాక్షం కలుగుతుంది.ఉదయమే శుభ్రంగా స్నానం చేసి ఇంటిలో ప్రత్యేక దీపారాధన చేసిన అనంతరం పసుపుని ఈ నీళ్ళల్లో కలిపి ఆ గ్లాసుతో ఇల్లు మొత్తం తిరిగి, ఆ పసుపు నీటి గ్లాస్ ను మన ఇష్టదైవం ఎదురుగా పెట్టి నమస్కరించుకుని అనంతరం ఓం కాకధ్వజయ: విగ్నహే, కడ్గహస్త ధీమహీ తన్మోమంతప్రచోదయాత్ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి.
ఈ విధంగా పసుపు నీటి గ్లాస్ ను ఒక గంట పాటు దేవుని గదిలో ఉంచి అనంతరం దానిని తీసుకువెళ్లి ఎవరూ తొక్కని ప్రదేశములోను అలాగే పారుతున్న నీటిలో లేదా బావిలో వేయాలి.ఈ విధంగా శని త్రయోదశి రోజు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఏలినాటి శని తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇకపోతే శని త్రయోదశి రోజు నల్లని వస్తువులు, నువ్వులు ఆవాలు, ఇనుము వంటి వస్తువులను పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World