Mahesh babu daughter: సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల పట్టి సితార గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సర్కారు వారి పాట సినిమా ద్వారా సితార సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. మదర్స్ డే సందర్బంగా సితార ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే ఆ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మాతృదినోత్సవం సందర్భంగా తన అమ్మ కొరకు స్పెషల్ గిఫ్టును ప్లాన్ చేశానని ఆ గిఫ్టు సర్ ప్రైజ్ అని సితార అన్నారు.
ఈరోజు మదర్స్ డే కావడంతో అమ్మతో స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాయనని సితార కామెంట్లు చేసారు. తనను సితూ పాపా అని ఫ్యామిలీ మెంబర్స్ పిలుస్తారని సితార చెప్పుకొచ్చారు. అమ్మకు తనతో అమ్మగా పిలిపించుకోవడమే ఇష్టం అని వివరించింది. అమ్మ చాలా స్వీట్ అని అవసరమైన సమయంలో మాత్రమే అమ్మ స్ట్రిక్ట్ గా ఉంటారని చెప్పుకొచ్చారు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుందని సితార పేర్కొన్నారు. స్కూల్ లో అన్ని యాక్టివిటీస్ లో పాల్గొనే విధంగా ఉన్న ప్రోత్సాహం ఉంటుందని సితార వివరించారు. అలాగే చదువు విషయంలో తాను అస్సలే నిర్లక్ష్యంగా ఉండదని పేర్కొన్నారు.
ఏదైనా కావాలంటే అనుకున్న సమయంలో అమ్న నో చెబితే నాన్నకు చెబుతానని సితార తెలిపారు. ఇంట్లో అమ్మ నన్నే ఎక్కువగా గారాబం చేస్తుందని సితార వివవించారు. ఇతరుల విషయంలో దయతో ఉండాలని పాజిటివ్ గా ఉండాలని అమ్మ చెబుతుందని సితార చెప్పుకొచ్చారు. అమ్మ మదర్ టంగ్ మరాఠీ అని.. కానీ ఆ భాష తనకు ఫ్లూయంట్ గా రాదని సితార కామెంట్లు చేశారు.