Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు మే 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ఫంక్షన్ కు వచ్చినందుకు థాంక్స్ అని సౌందర్య స్వప్నకు చెబుతుంది. దానితో స్వప్న రాలేదు.. రావలసి వచ్చిందని చెబుతుంది. మరోవైపు జ్వాల వస్తున్న కారును పోలీసులు ఆపి డిక్కీ తెరుస్తారు. అందులో మొత్తం నగలు, చాలా డబ్బు ఉంటుంది.
దాంతో ఏమీ తెలియని జ్వాల.. పరువు పోయినట్టుగా ఉంటుంది. ఇక పోలీసులు ఒక సారి స్టేషన్ కి రా అని అంటారు. మరోవైపు సత్య స్వప్న చేయి పట్టుకుని కేక్ కట్ చేస్తాడు. ఆ తర్వాత సౌందర్య ఇప్పుడు వీళ్ళకు ఒక బహుమతి ఇవ్వబోతున్నాను అని అంటుంది. దానితో ప్రేమ్ తన అమ్మమ్మ తన కోసం ఏదో చేస్తుందని ఫీల్ అవుతాడు.
నా మనవరాలు హిమ ను నా మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది. దాంతో స్వప్న ఒకసారిగా స్టన్ అవుతుంది. ఆ సమయంలో హిమకు ఏమీ అర్ధం కాదు. ఇక నా మనవరాలు ను పెళ్లి చేసుకొబోయే మనవడు డాక్టర్ నిరూపమ్ అని అంటుంది. మరో వైపు జ్వాల ను పోలీస్ లు స్టేషన్ కి తీసుకొని వెళతారు.
ఆ మాటతో ప్రేమ్ ఎంతో బాధపడతాడు. ఆ తర్వాత స్వప్న నాకు తెలియకుండా డిసిషన్ తీసుకుంటావా అని తన తల్లి పై విరుచుకుపడుతుంది. ఇక సౌందర్య పెళ్లి విషయం లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని అంటుంది. అంతేకాకుండా గుళ్లో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. నువ్వు ఆపగలవా అని అంటుంది.
ఇక స్వప్న ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని అంటుంది. ఈ క్రమంలో తల్లి కూతుర్ల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతుంది. మరోవైపు జ్వాల తన తప్పు లేదని పోలీస్ స్టేషన్ లో నిరూపించుకొని వచ్చేసరికి ఇక్కడ ఫంక్షన్ అయిపోతుంది.
మరోవైపు నిరూపమ్ నీకు ఐ లవ్ యు చెప్పాలని.. ఎన్నోసార్లు ట్రై చేశాను అని హిమ తో అంటాడు. ఇక హిమ అవన్నీ నా మనసులోని మాటలే బావ.. అని అంటుంది. దాంతో వారిద్దరూ ఒక్కటై పోతారు. అంతేకాకుండా ఒకరికి ఒకరు పట్టుకుంటారు.
మరోవైపు జ్వాల.. తన ఆటోలో సరదాగా కూర్చొని మన ఇద్దరినీ ఎవరు వేరు చేయలేరు లే అని నిరూపమ్ ఫోటో చూసుకుంటూ మురిసి పోతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇక తన హాట్ బ్రేక్ అయ్యే మాట తెలిసిన ప్రేమ్ ఏం చేస్తాడో తెలియాలి అంటే వేచి చూడాల్సి ఉంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World