Rabbits: దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కుందేళ్ళు… అసలేం జరిగిందంటే?

Rabbits: కుందేలు సాధు జంతువులు అనే విషయం మనకు తెలిసిందే. చూడటానికి ఎంతో అందంగా ముద్దుగా వుండే కుందేళ్ళు పెంచుకోవడానికి ఎంతోమంది ఇష్టత చూపుతుంటారు. అయితే ఈ కుందేళ్ళ కారణంగా ఏకంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. ఈ కుందేళ్ళ కారణంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తలెత్తేడమే కాకుండా కరువుకాటకాలు కూడా ఏర్పడ్డాయి. మరి కుందేళ్ళ కారణంగా అంత ఆర్థిక క్షోభ ఎదుర్కొన్న దేశం ఏది కుందేళ్ల వల్ల ఎలాంటి నష్టం ఏర్పడింది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

Advertisement

19వ శతాబ్దం మధ్యకాలంలో యూరప్ నుంచి కొన్ని కుందేళ్ళను ఆస్ట్రేలియాకు దిగుమతి చేశారు ఇక్కడ కుందేళ్ళను పెంచుతూ అప్పట్లో అక్కడ ఉండే జంతువులను వేటాడటం కోసం వీటిని ఏరగ ఉపయోగించేవారు. ఇలా కుందేళ్లను ఎరగా వేస్తూ అక్కడ జంతువులను వేటాడుతూ ఉన్నప్పటికీ క్రమక్రమంగా కుందేళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఇలా 1930 నాటికి కుందేళ్ళ సమస్య అధికం అవుతూ వచ్చింది. ఇక వీటిని అదుపు చేయడం ఎవరి తరం కాలేదు. ఇలా వందల సంఖ్యలో కుందేళ్ళు పెరగటంతో పంట పొలాలు మొత్తం నాశనం అయ్యాయి.

Advertisement

భూమిపై గడ్డిపోచ మొలక రాకుండా కుందేళ్ళు వాటిని తినేయడంతో పశుగ్రాసం తగ్గిపోయింది. అలాగే వ్యవసాయం పై తీవ్రమైన ప్రభావం ఏర్పడింది. ఇలా కుందేళ్ళ కారణంగా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. దీంతో ఈ ఆర్థిక వ్యవస్థను పెంచుకోవాలంటే కుందేళ్ళ బెడద తగ్గించాలని భావించిన దేశ ప్రభుత్వం కుందేళ్లు ఎక్కడ కనబడితే అక్కడ చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది.దీంతో రైతులు పంట పొలాలకు విషపు మందు కొట్టే కుందేళ్ళను చంపేవారు. అలాగే వాటి బోరియలను యంత్రాల సహాయంతో నాశనం చేసేవారు. ఇలా ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కుందేళ్ళ బెడద మాత్రం తగ్గలేదు.

Advertisement

ఈ క్రమంలోనే ఈ కుందేళ్ల బెడద తగ్గడానికి 1950 లో ఉరుగ్వే నుంచి మిక్సోమా అనే ప్రమాదకర వైరస్‌ను తీసుకొచ్చారు.ఈ వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చేసి కుందేలును కొట్టడం వల్ల వాటి శరీర భాగాలు చాలావరకు ఉబ్బి చనిపోయాయి. అయితే కొన్ని రోజుల అనంతరం ఈ వైరస్ ను తట్టుకొనే పోరాడే శక్తి కుందేళ్ళకు లభించింది. దీంతో చేసేదేమీ లేక 1990ల్లో.. మరో కొత్త వైరస్ ప్రయోగించారు. అది మొదట్లో ఫలితాలనిచ్చినా. తర్వాత ఈ వైరస్ ని తట్టుకొని నిలబడ్డాయి. అయితే ఆస్ట్రేలియాకు ఇప్పటికీ ఈ కుందేళ్ళ బెడద ఉందని ఈ సమస్య ఎప్పుడైనా పునరావృతం కావచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Advertisement
Advertisement