Raashi Khanna: మదర్స్ డే సందర్భంగా తల్లికి కారును గిఫ్ట్ గా ఇచ్చిన హీరోయిన్… ధరఎంతంటే?

Updated on: May 9, 2022

Raashi Khanna: మాతృదినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు వారి మాతృ మూర్తులకు ఖరీదైన బహుమతులను అందజేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది వారి తల్లులతో కలసి వారికున్న తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి రాశి ఖన్నా మదర్స్ డే సందర్భంగా తన తల్లికి ఖరీదైన బహుమతి ఇచ్చారు. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లకు ఎంతో బిజీగా ఉన్న రాశి ఖన్నా మదర్స్ డే సందర్భంగా ఆదివారం తన తల్లికి ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చింది.

ఈ క్రమంలోనే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కారు ధర ఏకంగా 1.40 లక్షలని తెలుస్తోంది.షోరూమ్‌లో బీఎండబ్ల్యూ కారుని కొనుగోలు చేస్తున్నప్పుడు వారు తీసుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ విధంగా తన తల్లికి ఖరీదైన బహుమతిని అందజేసి తల్లి పై తన ప్రేమను చాటుకున్నారు.ఇక ఈమె సినిమాల విషయానికొస్తే గోపీచంద్ సరసన నటించిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే నాగచైతన్య సరసన థ్యాంక్యూ అనే చిత్రంలో నటించారు.ఈ సినిమా కూడా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. వీటితో పాటు హిందీలో యోధ అనే సినిమాలో నటిస్తోంది. సిద్దార్థ్‌ మల్హోత్రా, దిశా పటానీ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫర్జీ అనే హిందీ వెబ్ సిరీస్ లో బిజీగా ఉన్నారు. అలాగే తమిళంలో ఏకంగా నాలుగు సినిమాలకు సంతకం చేసి కెరీర్లో ఎంతో బిజీగా ఉన్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel