Shani Dev: సాధారణంగా మనం పగలు లేదా రాత్రి నిద్రపోయేటప్పుడు కలలు రావడం సర్వసాధారణం. ఈ విధంగా కొందరికి మంచి కలలు రాగా మరికొందరు చెడ్డ కలలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే మనకు వచ్చే కలలు నిజమవుతాయని కొందరు భయాందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే మనకు వచ్చే కళలకు కూడా అర్థం ఉంటుందని కొన్ని కలలు రావడం వల్ల భవిష్యత్తులో అవి దేనిని సూచిస్తాయనే విషయాల గురించి సంఖ్యా శాస్త్రం తెలియజేస్తుంది.మరి మనం నిద్రపోయే సమయంలో చాలా మందికి వివిధ రకాల దేవుళ్ళు కలలోకి వస్తారు. అయితే మన కళ్ళలో కనుక శని దేవుని విగ్రహం కనబడితే కొన్ని కారణాలకు దారితీస్తుందని పండితులు చెబుతున్నారు. మరి మన కలలో శని విగ్రహం కనపడితే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే…
కలలో శని దేవుని విగ్రహం కనపడితే కొందరికి శుభ సంకేతాలు జరుగుతాయి. మరికొందరికి కష్టాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. మన జాతకంలో శని స్థానాన్ని బట్టి శనిదేవుని ప్రభావం మనపై ఉంటుంది. కొందరికి శని దేవుని విగ్రహం కలలో వస్తే లేని ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. మీ కలలో శనిదేవుడు నేరుగా వచ్చి అనుగ్రహించినట్లు అయితే ఆ కల ఎంతో శుభప్రదమైనది స్వయంగా శనీశ్వరుడు మీ కష్టాలను తొలగిస్తాడని అర్థం.
ఇక చాలామంది ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారు.అలాంటి వారికి శనీశ్వరుడు విగ్రహం కలలో కనపడితే అంతా శుభం ఫలితమే కలుగుతుంది. ఇక చాలామందికి కలలో శని దేవుడు విగ్రహ రూపంలో కాకుండా శనీశ్వరుడు ఆలయం కలలో కనబడుతుంది. ఈ విధంగా ఎవరికైతే శనీశ్వరుని ఆలయం కలలో కనబడుతుందో అలాంటి వారి పట్ల శని దేవుడి శుభ అనుగ్రహం ఉంటుందని అర్థం. అలా శనీశ్వరుడు ఆలయం కలలో కనిపించే వారి సమస్యలని తొలగిపోతాయని చెప్పవచ్చు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World