...

Samantha, preetham: ప్రీతమ్ కు ఐ లవ్ యూ చెప్పిన సామ్.. లవ్ యూ టూ అంటూ రిప్లై!

Samantha, preetham: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈమెకు సంబంధించి ప్రతీది వార్తే అవుతుంది. ఈమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టినా.. ఎవరికైనా రిప్లై ఇచ్చినా అది హాట్ టాపిక్ గానే మారుతుంది. ముఖ్యంగా ఈమె అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఎక్కువగా జరుగుతోంది. అయితే తాజాగా సమంత… ఆమై స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్ కి ఐ లవ్ యూ చెప్పింది. దానికి అతడు స్పందిస్తూ… ఐ లవ్ యూ టూ అంటూ రిప్లై ఇచ్చాడు. సామ్ జీవితంలో జుకల్కర్ కారణంగా చాలా కాంట్రవర్సీ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement

Advertisement

సమంత, నాగ చైతన్యల విడాకుల వెనుక ప్రీతమ్ జుకల్కర్ కూడా ఓ కారణమంటూ చాలా వార్తలు వచ్చాయి. సమంత పర్సనల్ స్టైలిస్ట్, డిజైనర్ అయిన ప్రీతమ్ తో సామ్ సన్నిహితంగా ఉంటుందంటూ.. అదే చై కి నచ్చకు వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు గట్టిగా ప్రచారం జరిగింది. అయితే ఇదంతా తప్పంటూ గతంలోనే ప్రీతమ్ స్పందించినప్పటికీ… ఈ వార్తలు నేటికీ కొనసాగుతున్నాయి. తాజాగా సామ్ చేసిన మరో పోస్ట్ తో మళ్లీ తెరపైకి వీరి పేర్లు వచ్చాయి.

Advertisement
Advertisement