Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Samantha: సమంతకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమైన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందం, అభినయంతో చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. పెద్ద పెద్ద హీరోల సరసన నటిస్తూ.. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాదు హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని.. అక్కినేని కుటుంబానికి కోడలిగా మారింది. కానీ అనుకోని కారణాల వల్ల చైతో విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. ... Read more

By Vinod Kumar

Published on: April 28, 2022 9:00 AM

Updated on: April 28, 2022 1:53 AM

---Advertisement---

ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమైన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందం, అభినయంతో చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. పెద్ద పెద్ద హీరోల సరసన నటిస్తూ.. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాదు హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని.. అక్కినేని కుటుంబానికి కోడలిగా మారింది. కానీ అనుకోని కారణాల వల్ల చైతో విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది.

ఇదిలా ఉండగా.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఆస్తిపై చాలానే వార్తలు వస్తుంటాయి. అయితే సమంతకు దాదాపు 80 కోట్ల వరకూ ఆస్తి ఉందని టాలీవుడ్ సమాచారం. ఆమె ఒక్కో సినిమాకు గాను 2 నుంచి 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అంతే కాకుండా పలు షాపింగ్ మాల్ ఓఫెనింగ్స్.. యాడ్స్.. వెబ్ సిరీస్… సినిమాలు.. ఇలా వచ్చిన అవకాశాలన్నింటినీ వాడుకుంటూ తన అందం, అభినయంతో సత్తా చాటుతోంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.