...

Sarkaru vari pata: సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ లో హైదరాబాద్ పోలీసులు..!

Sarkaru vari pata: మహేష్ బాబు ఇటీవలే నటించిన అప్ కమింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట సినిమాను పరశురామ్ తెరకెక్కించారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందు రానుండగా… మూవీ టీమ్ నిన్ననే ట్రైలర్ ను విడుదల చేసింది. అయితే హైదరాబాద్ పోలీసులు సైతం ట్రాపిక్ రూల్స్ ను వివరిస్తూ ఈ ట్రైలర్ లోని ఓ షాట్ ను హైదరాబాద్ పోలీసులు ఉపయోగించారు. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

హైదరాబాద్ సిటీ పోలీసులు ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు చాలా క్రియేటివ్ గా మారిపోయారు. ఈ మధ్య కాలంలో వారు ట్రాఫిక్ రూల్స్ గురించి సరికొత్తగా ప్రచారం చేస్తున్నారు. అనేక రకాల పద్ధతుల్లో ట్రాఫిక్ రూల్ప్ పై అవగాహన కల్పిస్తున్నారు. మీమ్స్ రూపంలో ఎంటర్ టైనింగ్ ట్రాఫిక్ రూల్స్ ను వివరిస్తున్నారు. తాజాగా సర్కారు వారి పాట సినిమాను కూడా వాడుకొని సరికొత్త ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమా ట్రైలర్ లో హీరో… విలన్ గ్యాంగ్ లోని ఒకడికి హెల్మెట్ పెట్టే షాట్ ఉంది. ఆ షాట్ ను కట్ చేసి హైదరాబాద్ సిటీ పోలీసులు తమ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. హెల్మెట్ ధరించండి అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టారు. ఇక ట్రెండింగ్ లో ఉన్నదాన్ని ఫాలో అయిపోవడం సిటీ పోలీసులుకు బాగా తెలుుసంటూ కామంట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement