October 5, 2024

Electricity Bill: ఎండాకాలంలో కరెంటు బిల్లు తడిసి మోపెడు అవుతోందా… కరెంట్ బిల్లు తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి!

1 min read
pjimage 84

Electricity Bill: ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ బిల్ పై అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ వేసవి కాలం కూడా కావడంతో ఒక్క క్షణం ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాము. ఇలా 24 గంటల పాటు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఆన్ చేసి ఉండటం వల్ల నెల వచ్చే సరికి కరెంటు బిల్లు తడిసి మోపెడు అవుతున్నాయి.ఇలా అధిక కరెంటు బిల్లులు తో సతమతమయ్యేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటించడం వల్ల కరెంట్ బిల్ పూర్తిగా తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

pjimage 84చాలామంది ఇళ్లల్లో ఏసీలు ఉండటం సర్వసాధారణం అయితే ఏసీలు ఉన్నవారు తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏసీ ఆన్ చేయడం వల్ల త్వరగా ఇల్లు మొత్తం కూల్ అవుతుందని భావిస్తారు. అయితే ఏసీ ఎల్లప్పుడూ కూడా 24 నుంచి 26 మధ్య ఉండటంవల్ల నెలకు 300 రూపాయల వరకు కరెంటు బిల్లు ఆదా చేయవచ్చు. ఇక ఏసీ ఆన్ చేసినప్పుడు పూర్తిగా కిటికీలు తలుపులు వేయడం వల్ల రూమ్ చాలా త్వరగా చల్లబడుతుంది. కరెంటును కూడా ఆదా చేయవచ్చు.

ఫ్రిడ్జ్ ఉపయోగించేవారు ఫ్రిడ్జ్ ఉండే వెనుక గోడకు మధ్య కొంత స్థలం ఉండాలి. అలాగే ఫ్రిడ్జ్ డోర్ వేసేటప్పుడు పూర్తిగా తేర లేకుండా వేయాలి. అలాగే బయట వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఫ్రిడ్జ్ కూలింగ్ పెంచడం తగ్గించడం చేస్తూ ఉండాలి.

ఇక ప్రస్తుత కాలంలో చాలా మంది ఇళ్లలో ఫిలమెంట్ బల్బులు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఫిల్మెంట్ బల్బులు ఉపయోగించడం వల్ల అధిక కరెంట్ బిల్ వస్తుంది. అందుకే ఫిలమెంట్ బల్బులకి బదులు ఎల్ఈడీ బల్బులు ఉపయోగించడం వల్ల కరెంటు బిల్లులను తగ్గించుకోవచ్చు.ఇక ఇంటి నుంచి మనం వేరే ప్రాంతాలకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా ఇంట్లో లైట్లు ఫ్యాన్లు కూలర్లు ఏసీలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ఆఫ్ చేసి వెళ్లాలి. ఈ విధంగా ఈ టిప్స్ పాటించండి వల్ల నెలకు చాలా మొత్తంలో కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు.