September 21, 2024

Nonveg On Sunday: ఆదివారం మాంసాహారం తినకూడదు… ఆదివారం ప్రత్యేకత ఏమిటి.. మాంసం తినకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

1 min read
pjimage 56

Nonveg On Sunday:ప్రస్తుతకాలంలో ఆదివారం వచ్చిందంటే చాలు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ రకాల మాంసాహారాలను తయారు చేసుకొని తినడం, మందు పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తూ ఆ రోజు మొత్తం ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఆదివారం అంటేనే మాంసాహారం రోజుగా భావిస్తారు. నిజానికి మన పురాణాల ప్రకారం ఆదివారం ఎంతో పరమ పవిత్రమైన రోజు అని చెప్పాలి.ఇలాంటి పవిత్రమైన రోజు ఎలాంటి మద్యం మాంసాహారాలను తాకకూడదని పురాణాలు చెబుతున్నాయి.

pjimage 56పురాణాల ప్రకారం ఆదివారం సూర్య దేవుడికి చెందినది. అందుకే ఆదివారాన్ని రవివారం అని కూడా పిలుస్తారు. పురాతన కాలంలో మన పెద్దవారు ఆదివారం ఉదయం సూర్య దేవుడికి నీటిని సమర్పించి ప్రత్యేకంగా పూజలు చేసేవారు.అంతటి పవిత్రమైన ఆ రోజున ఎలాంటి మాంసాహారాలను ముట్టుకోకుండా కేవలం పండ్లు కూరగాయలతో భోజనం చేసేవారు. ఇలా ఎంతో పవిత్రంగా భావించే ఈ సంప్రదాయాన్ని బ్రిటిష్ వారు వారి చెడు ఆలోచనలతో మన సాంప్రదాయాలని తొక్కేసారు.

భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన కొనసాగాలంటే ముందుగా హిందువులు సాంప్రదాయాలను అణచివేయాలనే ఉద్దేశంతో ఎంతో పవిత్రమైన ఆదివారం సెలవు దినంగా ప్రకటించి ఆదివారం విచ్చలవిడిగా మద్యం మాంసాహారం తినడం అలవాటు చేశారు.ఇలా అప్పటినుంచి భారతీయులు కూడా ఆదివారం అంటే సెలవు దినంగా భావించి ప్రతి ఒక్కరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల మాంసాహారాలను తయారు చేసుకొని తింటుంటారు. పురాణాల ప్రకారం ఆదివారం పొరపాటున కూడా మద్యం మాంసం తీసుకోవడమే కాకుండా ఆడవారికి కూడా దూరంగా ఉండాలి అని పురాణాలు చెబుతున్నాయి.