Weather reort: రాగల మూడ్రోజులు బయటకు రావొద్దు.. వడగాలులు వీచే అకాశముందట!

రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా నేటి నుంచి మూడ్రోజుల పాటు వడ గాలులు వీచే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావారణ కేంద్రం తెలిపింది. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడాని వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే విపరీతమైన గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని… అత్యవసరం అయితే తప్ప ప్రజలు అస్సలే బయటకు రాకూడదని తెలిపింది.

weather report in telangana

చిన్న పిల్లలు, వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రానివ్వద్దని వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. అలాగే ఎక్కువగా నీళ్లు తాగుతూ, జ్యూస్ లు, పండ్ల రసాలు తాగుతూ… ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. బయట వేడి గాలిలో తిరిగితే.. వడదెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పారు. రాత్రిళ్లు కూడా బయట పడుకోవడం వంటివి చేయొద్దని వివరిస్తున్నారు. బయట వీచే వడ గాలుల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే వీలుందని… కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు.