Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ, జ్వాలా ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ హిమ భయంతో వణికిపోతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా ఆర్టిస్ట్ కు పోలికలు చెబుతాను మీరు నోట్ చేసుకోండి అని చెప్పి హిమ చిన్నప్పటి పోలికలు చెబుతుంది. మరొకవైపు హిమ భయంతో వణికి పోతూ ఉంటుంది. ఇక ఆర్టిస్ట్ కీ హిమ పోలికలు చెప్పిన తర్వాత జ్వాలా అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇక మరొకవైపు ప్రేమ్,నిరూపమ్ కీ ఫోన్ చేసి పెళ్లి కుదిరింది అంట కదరా కంగ్రాట్స్ అని చెప్పడంతో నాకు పెళ్లి ఏంటి రా అని అడగగా మమ్మీ నీకు పెళ్లి సంబంధం చూసింది నీకు తెలియదా అని అనడంతో, అప్పుడు నిరూపమ్ స్వప్న ని పిలిచి,ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పి కోప్పడతాడు. కానీ స్వప్న,నిరూపమ్ బలవంతంగా ఒప్పిస్తుంది.
స్వప్న ఇంటికి సౌందర్య వస్తుంది. ఆ తర్వాత ఆనందరావు కూడా అక్కడికి రావడంతో స్వప్న వారిపై కోప్పడగా, అప్పుడు సౌందర్య తనదైన శైలిలో సమాధానం చెబుతుంది. ఇంతలోనే స్వప్న అరెంజ్ చేసిన పెళ్లికూతురు అక్కడికి రావడంతో, సౌందర్య స్వప్న కి షాక్ ఇస్తు పెళ్లి కూతురుతో నిరూపమ్ కీ రాఖి కట్టిస్తుంది.
నిరూపమ్ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ స్వప్న మాత్రం కోపంతో రగిలి పోతూ ఉంటుంది. పెళ్లి వారు వెళ్లిపోయిన తరువాత స్వప్న, సౌందర్య పై అరవగా నువ్వు ఎంత మంది పిలుచుకుని వచ్చి నేను ఇలాగే చేస్తాను. ప్రపంచంలో ఉన్న అందరూ ఆడపిల్లలు నిరూపమ్ చెల్లెల్లు.
ఎలా అయినా సరే నిరూపమ్ కీ హిమ ను ఇచ్చి పెళ్లి చేస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సౌందర్య. మరొకవైపు జ్వాలా,హిమ ను పిలుచుకొని హాస్పిటల్ దగ్గర దిగబెడుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.