September 21, 2024

Megastar Chiranjeevi: కూతురి కోసం కోట్ల రూపాయలు కూడా లెక్క చేయని చిరంజీవి..!

1 min read
GV1BtWFH

Megastart Chiranjeevi: ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోలలో ఒక వెలుగు వెలిగిన హీరో చిరంజీవి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ టాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్ మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా కూడా మళ్లీ ఖైదీ నెంబర్ 150 ఈ సినిమా ద్వారా హీరో గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఏ సినిమా విజయం సాధించడంతో వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం చిరంజీవి కుర్ర హీరోలకు కూడా పోటీగా సినిమాలు చేస్తున్నాడు.

GV1BtWFH

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి గుర్తింపు పొందారు. ఇంతకాలం డిజైనర్ గా తన ప్రతిభ కనబరిచిన సుస్మిత ఇప్పుడు నిర్మాతగా మారింది. ప్రస్తుతం సుస్మిత గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తోంది. ఈ బ్యానర్ లో మొదటగా నిర్మించిన వెబ్ సిరీస్ కి మంచి పేరు రావడంతో సినిమాలు నిర్మించడానికి కూడా సిద్ధమయ్యింది.

గోల్డ్ బాక్స్ బ్యానర్ పై మొదటిగా నిర్మితమైన సినిమా ” శ్రీదేవి శోభన్ బాబు” . తన తండ్రికి ఉన్న పలుకుబడితో పెద్ద పెద్ద హీరోలు , నిర్మాతలు చేతిలో ఉన్న కూడా సుస్మిత మొదటగా చిన్న సినిమాని తెరకెక్కించింది. అయితే ఇటీవల జరిగిన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “శ్రీదేవి శోభన్ బాబు” సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ఈ విధంగా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి తన కూతురు నిర్మాణ సంస్థను ప్రమోట్ చేశారు. మంచి కథ, దర్శకుడు దొరికితే గోల్డ్ బాక్స్ బ్యానర్లో సినిమా చేసేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నాడు.

అయితే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం కూతురు కోసం చిరంజీవి జీరో రెమ్యూనరేషన్ తో సినిమా చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చిరంజీవి కథ ని బట్టి ఒక్కో సినిమాకి 30 నుంచి 50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు. కూతురి కోసం దాదాపు యాభై కోట్ల రూపాయలను కూడా లెక్కచేయకుండా ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.