Actress Prema : అందరి ముందే హీరోయిన్ ప్రేమతో రొమాన్స్ చేసిన హీరో వెంకట్.. హీరో నాగార్జున అమ్మాయి అయ్యుంటే?

Actress Prema : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సుమ క్యాష్ కార్యక్రమం ఒకటి. ప్రతి వారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం సుమ క్యాష్ కార్యక్రమానికి హీరో వెంకట్ పృధ్వి, రోహిత్, హీరోయిన్ ప్రేమ హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సుమ పంచ్ డైలాగ్ లకు వీరు చేసే అల్లరి ఎంతో సందడిగా ఉందని చెప్పాలి.

Actress Prema
Actress Prema

ఇకపోతే ఈ ప్రోమోలో భాగంగా సుమ వీరికి ఒక టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో భాగంగా హీరోయిన్ ప్రేమ కూరగాయలు కోస్తూ వేలు కట్ చేసుకుంటే నువ్వు హీరో ఐతే ఎలా బిహేవ్ చేస్తావ్ అంటూ వెంకట్ ను అడగగా వెంకట్ తన వేలిని నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆమెతో రొమాన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే హర్రర్ కథ అయితే.. పృథ్వి దెయ్యంలాగా మారుతాడు. అదే ఫ్యాక్షన్ సినిమా అయితే రోహిత్ తన రక్తంతో రక్తతిలకం పెట్టుకుంటాడు.

ఈ క్రమంలోనే సుమ ఒక్కొక్కరిని ప్రశ్నలడుగుతూ ముందుగా హీరో పృద్విని ప్రశ్నిస్తూ వెంకటేష్ నాగార్జున వీరిద్దరిలో మీరు కో స్టార్ గా నటించాల్సి వస్తే ఎవరితో నటిస్తారు అని ప్రశ్నించారు. దీంతో వెంటనే పృద్వి నాగార్జునతో కలిసి నటిస్తానని తెలిపారు. నాగార్జున కనుక అమ్మాయిగా పుట్టి ఉంటే తాను తప్పకుండా తనని పెళ్లి చేసుకునే వాడిని, అంత ఇష్టం నాగార్జున అంటే అంటూ పృథ్వి నాగార్జున గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ అందరిని ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Read Also : Suma Kanakala : విడాకులు భార్య భర్తలకు మాత్రమే.. పిల్లలకు కాదు.. తన భర్తతో గొడవల గురించి నోరువిప్పిన సుమ!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel