Big Boss Non Stop : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో కంటెస్టెంట్ ల రచ్చ మాములుగా లేదు. ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బాబా మాస్టర్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో కంటెస్టెంట్ ల మధ్య కొంత అలజడి నెలకొంది. ఈ క్రమంలోనే నటరాజ్ మాస్టర్, అఖిల్ ఇద్దరు కూర్చుని హౌస్ లో కంటెస్టెంట్ ల గురించి ముచ్చట పెట్టారు. ఈ క్రమంలోనే బాబా భాస్కర్ ఎన్ని రోజుల పాటు హౌస్లో ఉంటారు అంటూ ఆయన గురించి చర్చించారు. ఇక ఈయన వెళ్తూ వెళ్తూ తప్పనిసరిగా ఒక కంటెస్టెంట్ ను బయటకు తీసుకు వెళతారని వీరిద్దరూ మాట్లాడుతూ కూర్చున్నారు.
బాబా భాస్కర్ మాస్టర్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే అఖిల్ కాస్త డల్ అయిపోయారు. ఇలా వీరిద్దరూ మాట్లాడుతూ కూర్చొని ఉండగా అక్కడికి అషురెడ్డి చీరకట్టులో ప్రత్యక్షమవుతుంది. ఈ విధంగా ఈమె చీరకట్టులో కనిపించడంతో నటరాజ్ మాస్టర్ నోటికి పని చెబుతూ కాస్త కంట్రోల్ తప్పారని చెప్పాలి.అషురెడ్డి వైపు అలా చూస్తూ తనని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక్కడ ఏసి ఉన్నా టెంపరేచర్ పెరిగిపోతుంది. రోజురోజుకు అందం రెట్టింపు అవుతోంది ఏంటి అషు అంటూ తన అందం గురించి పొగడ్తలు కురిపించారు.
ఇలా నటరాజు మాస్టర్ తనపై పొగడ్తల వర్షం కురిపించగా అషురెడ్డి వద్దులేండి మాస్టర్ అంటూ అనడంతో వెంటనే నటరాజ్ మాస్టర్ నిజం చెబుతున్నా.. మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళకి అమ్మాయిలు కనిపించరు… తెలుసుకునే లోపు అక్కడ ఏమీ ఉండదు ఇలా చీరకట్టులో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ నటరాజ్ మాస్టర్ అషురెడ్డి పట్ల వింతగా ప్రవర్తించాడు. ఇలా అషురెడ్డి అక్కడినుంచి కిచెన్ లోకి వెళ్ళినా ఈయన మాత్రం తనని పొగుడుతూ తన వెంట వెళ్లారు.ఇక ఈ ఎపిసోడ్ చూసిన నెటిజన్లు వీరీ వ్యవహారశైలిపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Read Also Big Boss Non Stop Telugu: నామినేషన్ ప్రక్రియలో ముదిరిన అఖిల్ బిందుమాధవి వివాదం.. వాడుకోవడం ఏంటి అంటూ రెచ్చిపోయిన అఖిల్!:
Tufan9 Telugu News And Updates Breaking News All over World