BSF Recruitment 2022 : సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది బీఎస్ఎఫ్. వీటితో పాటు జూనియర్ ఇంజినీర్, సబ్ఇన్స్పెక్టర్(ఎలక్ట్రికల్) పోస్టులను సైతం భర్తీ చేయనుంది. మే 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మొత్తం పోస్టులు, అర్హతలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీల వివరాలు.. ఒక ఇన్స్పెక్టర్ (ఆర్కిటెక్ట్), 57 సబ్ ఇన్స్పెక్టర్ (పనులు), 32 జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్). పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ఇన్స్పెక్టర్ (ఆర్కిటెక్ట్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్ట్లో డిగ్రీ సర్టిఫికెట్ సంపాదించి ఉండాలి. 1972 ఆర్కిటెక్ట్స్ యాక్ట్ ప్రకారం ఆర్కిటెక్చర్ మండలిలో నమోదు చేసుకొని ఉండాలి.
- సబ్ఇన్స్పెక్టర్ (పనులు): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉన్న విద్యాసంస్థ నుంచి సివిల్ ఇంజినీర్లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
- జూనియర్ ఇంజినీర్/ సబ్ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉన్న విద్యాసంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
వయసు నిబంధన: అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించకూడదునెలవారీ వేతనం ఇలా…:
- ఇన్స్పెక్టర్ (ఆర్కిటెక్ట్)- రూ.44,900- రూ.1,42,400 మధ్య ఉంటుంది.
- సబ్ ఇన్స్పెక్టర్ (పనులు)- రూ.35,400- రూ.1,12,400
- జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్)- రూ.35,400- రూ.1,12,400దరఖాస్తు ఇలా…:
- అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఫారం నింపవచ్చు. rectt.bsf.gov.in వెబ్సైట్లో అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మే 30 చివరి తేదీ.