September 21, 2024

Temperature in Telangana : ఓవైపు చల్లదనం, మరోవైపు విపరీతమైన ఉష్ణోగ్రత.. ఎక్కడెంత?

1 min read
Temperature in Telangana

Temperature in Telangana

Temperature in Telangana : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే.. మరి కొన్ని చోట్ల మాత్రం వాతావరణం చల్లబడింది. హైదరాబాద్, వికారాబాద్ ప్రాంతాల్లో చిరు జల్లులు కూడా కురిశాయి. అయితే చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి​లో అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్​ జిల్లా జైనధ్​లో 44.1 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మల్లాపూర్​లో 43.9, ఆదిలాబాద్​ అర్బన్​లో 43.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

Temperature in Telangana
Temperature in Telangana

ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ ఎండ తీవ్రతకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులకు తప్పితే జనాలు బయటకు రావడం లేదు. ఎండ తీవ్రతకు జనాలు అల్లాడుతున్నారు. బయటకు వచ్చిన వ్యక్తులు ఎండ వేడిమిని తట్టుకోలేక కొబ్బరి బొండాలు, జ్యూస్​లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. అయితే మరీ అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని… ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు అస్సలే బయటకు రాకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Kodada Crime : కోదాడలో దారుణం.. కూల్ డ్రింక్‌లో మత్తు కలిపి యువతిపై 3 రోజులుగా అత్యాచారం..!