Kodada Crime : మహిళలపై అత్యాచార ఘటనలు ఆగడం లేదు. చిన్నారులు, మహిళలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కామాంధుల ఆగడాలను అరికట్టేందుకు ఎన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా అత్యాచార ఘటనలు ఆగడం లేదు. సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో దారుణం వెలుగుచూసింది. ఓ యువతికి కిల్ డ్రింకులో మత్తు మందు కలిపి నిర్భంధించి మూడు రోజులుగా అత్యాచారం చేశారు. కోదాడలో సంచలనం రేకిత్తించిన ఈ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధిత యువతికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధిత యువతిని అబ్జర్వేషన్ లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. బాధిత యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడినట్టు యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బాధిత యువతి కోదాడ పట్టణంలో పూల వ్యాపారం చేస్తోంది. మూడు రోజుల క్రితం యువతిని ఆటోలో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లి.. కూల్ డ్రింకులో మత్తమందు కలిపి తాగించారు. మత్తు కారణంగా ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం ఆ యువతిని గదిలో నిర్భంధించి మూడు రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. వారినుంచి తప్పించుకునేందుకు యువతి ప్రయత్నించడంతో తీవ్రంగా హింసించినట్టు తెలిసింది.
చివరికి ఆ కామంధుల చెర నుంచి ఆ యువతి తప్పించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read Also : Vishwa Deendayalan Died : రోడ్డు ప్రమాదంలో యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మృతి..!