Big Boss Non Stop: వీడియోలు చూపించి మరీ అజయ్ కి క్లాస్ పీకిన నాగార్జున.. అలాంటి మాటలు మాట్లాడినందుకే వార్నింగ్..!

Big Boss Non Stop: గత కొన్ని సంవత్సరాలుగా టెలివిజన్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రస్తుత సీజన్ మాత్రం ఓటీటీ లో ప్రతి రోజు 24 గంటల పాటు ప్రసారమవుతుంది. ఈ సీజన్ మొదలై ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకుంది. మునుపటి సీజన్ లతో పోలిస్తే ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఆదివారం వచ్చిందంటే మాత్రం ప్రేక్షకులు ఈ రియాలిటీ షో కోసం ఎంతో ఆసక్తికరంగా చూస్తారు. అందుకు కారణం నాగార్జున హౌస్ మెట్స్ తో అడించే ఫన్నీ టాస్క్ లు, తప్పు చేసిన వారికి నాగార్జున ఇచ్చే పనిష్మెంట్ ల గురించి ఆసక్తికరంగ ఎదురు చూస్తూ ఉంటారు.పైగా ఆదివారం రోజు ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది.

గడిచిన ఆదివారం నాగార్జున కంటెస్టెంట్ లతో ఫన్నీ గేమ్స్ ఆడిస్తూ వారు చేసిన తప్పులకు గట్టిగా క్లాస్ పీకాడు. ఈ సందర్భంగా కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంట్లో ఉన్న సభ్యులందరూ అన్ ఫెయిర్ గేమ్ ఆడారని అన్నాడు. ఈ సందర్భంగా అజయ్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి బ్యాడ్ కామెంట్స్ చేసినందుకు గట్టిగా క్లాస్ పీకారు. ఆ సమయంలో అజయ్ మాట్లాడిన వీడియో కూడా చూపించాడు. ఇంటి సభ్యుల ముందు అఖిల్, ఆషూ దుప్పట్లో దడ్ దడ్ అంటూ  నీచంగా కామెంట్స్ చేశాడు. దీంతో అజయ్ మాట్లాడుతూ ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడలేదు. ఆ సమయంలో సినిమా టైటిల్స్ చెప్పుకుంటున్నామని అన్నాడు.

ఆ సమయంలో ఎవరిని ఉద్దేశించి ఇలా మాటలు మాట్లాడినా కూడా తప్పే అంటూ నాగార్జున అజయ్ కి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అజయ్ నాగార్జున గారికి సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలా మాట్లాడనని అన్నాడు. బ్రేక్ తర్వాత కన్ఫెషన్  రూమ్ లో జరిగిన దాని గురించి అఖిల్, ఆషూలతో చెప్పాడు. ముగ్గురు ఈ వీడియో గురించి చాలాసేపు చర్చించుకుని ఆషూ రెడీ అజయ్ ని
కన్సర్న్ చేయటానికి ట్రై చేసింది.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel