ఉప్పుతో అధిక రక్తపోటు ముప్పు తప్పదు… మందులు వాడుతూనే శారీరక శ్రమ, సమపాళ్లలో ఆహారం తీసుకుంటే అధిక రక్తపోటును అదుపులోకి తీసుకొని రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సోడియం ఉన్న ఆహారం తగ్గించి పొటాషియం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అధిక రక్తపోటును అదుపులో ఉంచే ఆహార నియమాల గురించి పోషకాహార నిపుణురాలు అంజలీదేవి పలు విషయాలు వెల్లడించారు.

ఎక్కువ కొవ్వు పదార్థాలు తని వ్యాయామం చేయకపోయినా రక్ నాళాలు గట్టి పడిపోతాయి. అలాగే రక్త నాళాల్లో సాగే గుణం తగ్గిపోయినపుడు అధిక రక్తపోటు వస్తుంది. ఇది మనం తీసుకునే ఆహారంతోనే ఏర్పడుతుంది. ఉప్పును వయసు ఆధారంగా తీసుకోవాలి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోవద్దు. మధుమేహం, వయసు మళ్లిన వారున్న వారికి 3 గ్రాముల లోపే ఇవ్వాలియ మాంసం అధికంగా తింటే రక్త నాళాల్లో కొవ్వు పట్టేస్తుంది. నరాల స్థాయిని తగ్గిస్తుంది. అరటి, జామ, నేరేడు పండ్లు బీపీని అదుపు చేసే గుణం ఉంటుంది. వంటలకు ఆలీవ్, నువ్వుల నూనెను వాడుకోవాలి.
- Child Care: చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే… ఈ ఆహార పదార్థాలు తినిపించాల్సిందే!
- Health Tips: సైజులో చిన్నగా ఉన్నా… మల్బరీ పండ్లలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Onion Health Benefits : ఎర్ర ఉల్లిపాయ తినొచ్చా? తెల్ల ఉల్లిపాయ మంచిదా? ఏది తింటే ఎక్కువ ఆరోగ్యకరమైన ప్రయోజనాలో తెలుసా?
















