KGF 2 Twitter Review : దుమ్మురేపుతున్న కేజీఎఫ్2.. ఫ్యాన్స్ రచ్చ.. పబ్లిక్ టాక్ ఇదిగో..!

Updated on: April 14, 2022

KGF 2 Twitter Review : పాన్ ఇండియా రాకింగ్ స్టార్ యష్ దుమ్మురేపుతున్నాడు. టాలెంటడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన KGF 2 మూవీ ప్రపంచం వ్యాప్తంగా 10000 థియేటర్స్ లో రిలీజ్ అయింది. kgf2 మూవీకి ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది. KGF చాప్టర్ 2 మూవీ ఏపీ, తెలుగు రెండు తెలుగు రాష్టాల్లోనూ ఈ రోజు (గురువారం) ఉదయం 7గంటల నుండి షోలు మొదలుకానున్నాయి. అయితే కేజీఎఫ్ 2 మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. యష్‌కి ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్ సీస్‌లో KGF chapter 2 చూసిన వారందరూ వరుసగా ట్వీట్లు మీద ట్వీట్లు చేసేస్తున్నారు. సినిమా సూపర్ అంటూ తెగ ట్వీట్లు పెడుతున్నారు. కేజీఎఫ్ 2 ఫస్టాఫ్‌లో హీరో ఇంట్రడక్షన్ కేక అంటున్నారు.

ఇక ఇంటర్వెల్ సీన్స్ అయితే గూజ్ బమ్స్ వచ్చేశాయని చెబుతున్నారు. రవి బస్రూర్ నేపథ్య సంగీతం నెక్ట్స్ లెవల్‌ అంటున్నారు. అదే సినిమాకు హ్యాట్రిక్ అంటున్నారు. మూవీ సెకండాప్.. ప్రారంభం నుంచే సన్నివేశాలను ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనిపించేలా ఉందని, హీరో మాస్ ఎలివేషన్స్ సీన్స్ సూపర్బ్ అంటూ ట్విట్టర్ వేదికగా చూసినవాళ్లంతా కామెంట్లు చేస్తున్నారు. కేజీఎఫ్ 2 మూవీ కోసం నిరీక్షణ ఫలించిందని, ప్రతీ సీన్ సూపర్ అంటున్నారు. హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల అంచనాలకు మించి తమ కష్టాన్ని చూపించారు. ఈ మూవీలో మాస్ సీన్స్, యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్, మదర్ సెంటిమెంట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ చక్కగా ఎలివేట్ చేశాుడ. పాన్ ఇండియా సినిమా కాదు.. ఓవర్ సీస్‌లోనూ రాకీ భాయ్ దుమ్మురేపుతున్నాడు..

KGF 2 Twitter Review _ Pan India Movie KGF 2 Twitter Review about Yash Prashanth Neel, These Tweets of audience (1)
KGF 2 Twitter Review _ Pan India Movie KGF 2 Twitter Review about Yash Prashanth Neel, These Tweets of audience

కొన్నాళ్ల క్రితమే ఎలాంటి అంచనాలు లేకుండా కేజీఎఫ్1 చాప్టర్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ కన్నడ సినిమా చరిత్రలో ఎవరూ ఊహించని రేంజ్‌కు చేరుకుంది. పాన్ ఇండియా రేంజ్‌లో దక్షిణాది సినిమా సత్తాను చాటింది. అప్పట్లో బాహుబలి తర్వాత అదే స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మూవీగా నిలిచిపోయింది. మాస్, యూత్‌ను ఆకట్టుకునేలా ప్రశాంత్ నీల్ మూవీని తెరకెక్కించగా.. యష్ తన నటనతో KGF 2 సీక్వెల్ ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి అంచనాలను మరింత పెంచేశాడు. అంచనాలను తగినట్టుగానే హోంబలే ఫిలింస్ మూవీని భారీగా నిర్మించింది. మొదటి పార్ట్ లోని కనిపించని రోల్స్.. సంజయ్ దత్, రవీనాటాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్‌లను తీసుకొచ్చింది. కరోనా కారణంగా KGF 2 విడుదల ఆలస్యమైనప్పటికీ టీజర్లు, ట్రైలర్లతో రికార్డులు క్రియేట్ చేశాయి.

Advertisement

Read Also : KGF2 Chapter : కేజీఎఫ్2 తెలుగు వర్షన్‌ వంద కోట్లు… వంద శాతం అసాధ్యం..!
Read Also :  KGF Movie: కేజీఎఫ్ సినిమా తీసిన ప్రాంతం నిజమేనా.. ఇందులో నిజమెంత..?

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel