Vastu Tips : ఈ కలియుగంలో కూడా ప్రజలకు జ్యోతిష్యశాస్త్రం పట్ల అపారమైన నమ్మకం ఉంది. ప్రత్యేకమైన పూజలు, వ్రతాలు చేయక పోయినప్పటికీ ఎవరికైనా ఏవైనా వస్తువులు దానం చేయటం వల్ల పూజ చేసిన ప్రతిఫలం లభిస్తుందని జ్యోతిషశాస్త్రంలో పరిగణించబడింది. అంతేకాకుండా దానం చేసి ప్రతిఫలం ఆశించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దానం చేసి ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం దానం చేసిన దానికి సార్థకత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం దానం చేసే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఏ సమయంలో దానం చేయవచ్చు ఎవరికీ దానం చేయవచ్చు అనే విషయాలు కూడా జ్యోతిష్య శాస్త్రంలో క్షుణ్ణంగా పరిగణించబడతాయి. అయితే సాయంత్రం సంధ్యా సమయంలో ఏ ఏ వస్తువులు దానం చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• సంధ్యా సమయం తర్వాత పొరపాటున కూడా డబ్బు దానం చేయకూడదు.సాయంత్ర సమయంలో డబ్బు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.
• సంధ్య సమయం తర్వాత పాలు, పెరుగు, పొరపాటున కూడా దానం చేయకూడదు.పాలు సూర్యుడు, చంద్రుడు రెండింటికి సంబంధించినవి కాబట్టి లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది. పెరుగు శుక్ర గ్రహానికి సంబంధించింది. సంధ్యా సమయంలో వీటిని దానం చేయటం వల్ల ఆనందం, శ్రేయస్సు తగ్గి జీవితం పై వ్యతిరేక ప్రభావం పడుతుంది.
• సంధ్యా సమయం తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి ,ఉప్పు దానం చేయకూడదు. ఇవి దానం చేయటం వల్ల ఎవరైనా చెడు ప్రయోగం చేసే అవకాశాలు ఉంటాయి. ఇవి దానం చేయటం కుటుంబ సభ్యులకు క్షేమం కాదు.
Read Also : Divorce on fist night: శోభనం రోజే విడాకులు కోరిన వరుడు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!