Guppedantha Manasu: రిషిని పొగడ్తలతో ముంచెత్తిన వసు..రిషితో డైరెక్ట్ గా మాట్లాడిన జగతి..?

Updated on: April 5, 2022

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

రిషి, వసు ఇద్దరూ ఒకచోట మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వసు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకు మీరు జగతి మేడం ఇద్దరు రెండు కళ్ళ లాంటి వారు అని అనడంతో, అప్పుడు రిషి, వసు ఫై సీరియస్ అవుతాడు. అప్పుడు వసు, రిషి రిషి చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కుంటుంది. అప్పుడు రిషి, వసు కి దగ్గరగా వెళ్లి ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటారు.

Advertisement

ఆ తర్వాత రిషి, వసు ముద్దుపెట్టుకుంటునట్టుగా వసు కి దగ్గరగా వెళ్లి వసు జడలో ఉన్న క్లిప్ తీసి ఇస్తాడు. ఆ తర్వాత వసు ని ఇంటి దగ్గర వదిలి పెట్టడానికి వెళ్తాడు రిషి. అప్పుడు వసు లోపలికి రండి సార్ అని అనగా రిషి వద్దులే అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అదంతా కూడా మహేంద్ర కిటికీలోనుంచి చూస్తూ ఉంటాడు.

ఇంటి వరకు వచ్చాడు నన్ను మాట్లాడించవచ్చు కదా అని మనసులో అనుకుంటూ ఉంటాడు మహేంద్ర. మరొకవైపు వసుధార దుప్పటి కప్పుకొని రిషితో చాట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు జగతి దుప్పటి కప్పుకొని ఏం చేస్తున్నావు అని అడగగా మీ అబ్బాయి తో చాటింగ్ చేస్తున్నాను అని అంటుంది. మా అబ్బాయి మీ ఎండి కాదా అని అనడంతో అప్పుడు వసు అవును అని అంటుంది.

ఇక మరుసటి రోజు ఉదయం రిషి ని జగతి, మహేంద్ర వెళ్లి కలుస్తారు. ఇప్పుడు మహేంద్ర మాట్లాడుతూ జగతి దగ్గరికి వెళ్లాను కానీ నీకు దూరం అవ్వలేదు అని అనడంతో, అప్పుడు రిషి మీరు ఎంత దూరం వెళ్లినా నా మనసు మీ నీడలో మీ వెంటే ఉంటుంది అని అంటాడు. ఆ తర్వాత క్లాసులో రిషి , వసు నోట్ బుక్ కాకుండా వేరే అమ్మాయి నోట్ బుక్ తీసుకుంటాడు. ఇంతకు ముందు చెప్పిన టాపిక్ గురించి మళ్ళీ చెబుతాడు.

Advertisement

ఆ తర్వాత జగతి రిషి దగ్గరకు వచ్చి టాబ్లెట్లు టేబుల్ పై పెడుతుంది. ఏంటి మేడం ఇది అని అడగగా.. మహేంద్ర టాబ్లెట్ వేసుకోవడం లేదు సార్.. మా ఆయన మా కొడుకు ని మిస్ అవుతున్నారు అని రిషి తో డైరెక్టుగా అంటుంది జగతి. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel