KCR Biopic : కేసీఆర్ బయోపిక్ తీస్తానంటూ ఆర్జీవీ సంచలన కామెంట్స్..!

Updated on: April 3, 2022

KCR Biopic : కాంట్రవర్సిటీకి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ తీస్తానంటూ చెప్పారు. నిజ జీవితం ఆధారంగా తీసే సినిమా కావడంతో స్క్రిప్టు పెద్ద కష్టమేం కాదని… తన మెదడులోనే ఉందన్నారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్ అభిమానులంతా ఆర్జీవీకి కృతజ్ఞతలు చెబుతన్నారు. కావాలనే ఎన్నికలకు ముందు ఆర్జీవీ ఈ సినిమా తీయబోతున్నారంటూ మరి కొందరు చెబుతున్నారు.

డేంజరస్ సినిమా ట్రైలర్ విడుదల చేసే కార్యక్రమంలో ఈ మాటలు అన్నారు డైరెక్టర్ రాం గోపాల్ వర్మ. అయితే స్వలింగ సంపర్కం నేర కాదని 2018లో సుప్రీంకోర్టీ తీర్పునిచ్చిన నేపథ్యంలో డేంజరస్ సినిమా తీయాలనే ఆలోచన వచ్చినట్లు వివరించారు. ఇద్దరి మహిళల మధ్య ప్రేమను సమాజం ఇప్పుుడిప్పుడే అంగీకరిస్తోందని తెలిపారు. ఏ్రపిల్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపారు. అయితే హీరోయిన్ నైనా గంగూలీ మాట్లాడుతూ అమ్మాయితో రొమాన్స్ నడిపే పాత్ర చేయడం చాలా కష్టమని చెప్పారు.

Read Also : Banjara Hills Pub Case : పబ్ కేసుపై నాగబాబు స్పందన.. ఏమన్నారో తెలుసా?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel