September 21, 2024

Upasana: అత్యుత్తమమైన పురస్కారాన్ని అందుకున్న మెగా కోడలు ఉపాసన… ఆయనకే అంకితం!

1 min read
upasana kamineni konidela 1

Upasana: టాలీవుడ్ యంగ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రీ అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలో చరణ్ నటనకు గాను సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లో కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే రామ్ చరణ్ హీరోగా అభిమానులను సినిమాల ద్వారా అలరిస్తూనే మరొకవైపు తనలో ఉన్న సేవా గుణాన్ని కూడా చాటుతూ ఉంటాడు. నిత్యం సామాజిక సేవ చేయాలి అని పరితపిస్తూ ఉంటాడు.

upasana kamineni konidela 1అందుకోసం చరణ్ కు ఆయన సతీమణి ఉపాసన కొణిదెల ప్రోత్సాహం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కేవలం సొసైటీకి మాత్రమే కాకుండా పర్యావరణ హితమైన కార్యక్రమాల్లో కూడా చెర్రీ ఉపాసన లు ముందుంటారు. రామ్ చరణ్ ఎప్పుడు హ్యూమన్ లైఫ్ ను మాత్రమే కాకుండా వైల్డ్ లైఫ్ ను కూడా కాపాడాలి అని చెబుతూ ఉంటాడు. మరొకవైపు ఉపాసన గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ ద్వారా ఎంతో కృషి చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.అయితే అందుకుగాను ఉపాసన ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సి ఎస్ ఆర్ పురస్కారానికి ఎంపిక అయ్యింది.

2022 ఏడాదికి గాను ఉపాసన ఆ పురస్కారాన్ని అందుకోబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. గొప్ప కార్యక్రమం లో మమ్మల్ని భాగం చేసిన మా తాతయ్య అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి కే ఈ అవార్డు ఘనత దక్కుతుంది అని తెలిపింది. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి లో భాగంగా వైద్య సేవలను మెరుగుపరచాలి అనేది ఆయన లక్ష్యం అని అదే నాకు స్పూర్తిని ఇచ్చింది అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. ఒకవైపు రామ్ చరణ్ సినిమాల ద్వారా ఇంత మంది అభిమానుల మనసులలో స్థానం సంపాదించుకుంటే, మరొకవైపు ఉపాసన సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మంది గ్రామీణ ప్రజల ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంటోంది. వీరిద్దరూ కూడా సేవా కార్యక్రమాల్లో భాగంగా ముందు ఉంటారు.