...

AP News: ఏపీ మంత్రివర్గ విస్తరణ… ఉత్కంఠతో ఎమ్మెల్యేలు, మంత్రులు… రేసులో ఎవరున్నారంటే?

AP News: ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు తేదీ ఖరారు అయ్యిందని తెలియటంతో ఆశావహుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే వచ్చే నెల ఏప్రిల్ 8న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గవర్నర్ తో భేటీ కానున్నారు. ఇక ఆ సమావేశంలో జగన్ గవర్నర్ కు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి వివరించనున్నారు. అందుకోసం వచ్చే నెల 11వ తేదీ అపాయింట్మెంట్ కావాలని కోరనున్నారు. రేపు నెల 11వ తేదీన కొత్తకేబినెట్ కొలువు తీరనుంది. ఇక ఆ రోజున ఏపీలోని కొత్త మంత్రులు,పాత మంత్రులకు సీఎం జగన్ విందు ఇవ్వనున్నారు.అయితే ప్రస్తుత కేబినెట్ నుంచి ఒకరికి లేదా ఇద్దరికీ అవకాశం ఉంది. ఎన్నికలకు రెండు నెలల ముందు సమూల మార్పులు జరుగుతున్నాయి.

Advertisement

కొత్త జిల్లాలతో కలిపి జిల్లాకు ఒక మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా అయిదు డిప్యూటీ సీఎం ల హోదాలు కొనసాగనున్నాయి. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు కు, తూర్పుగోదావరి జిల్లా నుంచి పొన్నాడ సతీష్ కు అవకాశం వుంది. కొడాలి నాని స్థానంలో వసంత కృష్ణప్సాద్‌ పేరు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక పేర్ని నాని స్థానంలో సామినేని ఉదయభాను, వెల్లంపల్లి స్థానంలో కొలగట్ల లేదా అన్నెరాంబాబు, కృష్ణా జిల్లా నుంచి రేసులో పార్థసారధి, జోగి రమేష్‌ లు ఉన్నారు. ఇక గుంటూరు నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి, గుంటూరు నుంచి విడుదల రజిని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు స్థానం నుంచి సుధకర్‌బాబుకు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అలాగే చిత్తూరు నుంచి రోజా, భూమన, మధుసూదన్‌రెడ్డి కి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కర్నూలు నుంచి చక్రపాణిరెడ్డి, కాటసాని, కంగాటి శ్రీదేవికి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అదేవిధంగా అనంతపురం నుంచి కాపు రామచంద్రారెడ్డి, ఉషా చరణశ్రీ, జొన్నలగడ్డ పద్మావతి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కడప నుంచి శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు, డాక్టర్‌ సుధా, అంజాద్‌బాషా స్థానంలో హఫీజ్‌ఖాన్‌కు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొత్స స్థానంలో కొలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనర్సయ్య పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పుష్పశ్రీ వాణి స్థానంలో రాజన్నదొర, భాగ్యలక్ష్మి, అరకు ఫల్గుణ, పోలవరం బాలరాజు, అవతి స్థానంలో గుడివాడ అమర్నాథ్‌ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement