Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ టైటిల్ విన్నర్తనే రివ్యూ ఇచ్చిన విశ్లేషకులు?

Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ కార్యక్రమం నేటితో ప్రసారమవుతూ 4 వారాలను పూర్తి చేసుకుంది. 17 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన బిగ్ బాస్ హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఈ కార్యక్రమానికి ఇది వరకే బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు, అదేవిధంగా మరికొంత మంది కొత్తవారు ఎంట్రీ ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరు బిగ్ బాస్ ట్రోఫీ కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మంచిగా ఉంటూనే వారి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు.

ఈ విధంగా బిగ్ బాస్ ట్రోపీ అందుకోవడం కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ట్రోఫీ ఎవరు అందుకుంటారనే విషయం గురించి ఇప్పటికే విశ్లేషకులు పలువురి పేర్లను ప్రస్తావిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ ఇప్పటికే ఈ సీజన్లో బిగ్ బాస్ ట్రోఫీఎవరు అందుకుంటారో వెల్లడించారు. తన అభిప్రాయం, అంచనాల ప్రకారం ఈసారి బిందుమాధవి బిగ్ బాస్ ట్రోఫీ అందుకుంటుందని కౌశల్ అభిప్రాయపడ్డారు.

బిందుమాధవి కూడా ఎవరితోనూ పేచీలకు పోకుండా తనపైకి ఎవరైనా వచ్చిన వారికి బాగా కౌంటర్ ఇస్తూనే టాస్క్ ఎంతో చాకచక్యంగా ఆడుతోంది. ఇలా తను మాట్లాడే ప్రతి విషయంలోనూ సరైన పాయింట్ ఉండటంతో ఈమెకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయారు.ఈ క్రమంలోనే బిందు మాధవి ఈ సారి బిగ్ బాస్ ట్రోఫీ అందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని బిగ్ బాస్ విశ్లేషకులు కూడా రిప్లై ఇస్తున్నారు. ఇదే కనుక నిజమైతే మొదటిసారిగా తెలుగులో ఒక మహిళ కంటెస్టెంట్ బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నట్లు నిలిచిపోతారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel