You Tube: యూట్యూబ్ యూజర్లకు షాక్ ఇచ్చిన గూగుల్… ఇకపై ఆ వీడియోలు చూడటం కుదరదు!

Updated on: March 17, 2022

You Tube: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ మనకు దర్శనమిస్తుంది. ఇలా చిన్న పిల్లలు సైతం సెల్ ఫోన్ లో యూట్యూబ్ ఆన్ చేసి వీడియోస్ చూస్తూ ఉంటారు. అయితే ఇలా ఉచితంగా ఎన్నో వీడియోలను చూడటం వల్ల యూట్యూబ్ కి లాభం ఏంటి అని చాలా మంది భావిస్తుంటారు.అయితే మనం చూస్తున్న వీడియోలో మధ్యలో కొన్ని యాడ్స్ వస్తాయి. ఈ యాడ్స్ ద్వారా యూట్యూబ్ కి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంది. అందుకే మనకు ఉచితంగా ఈ వీడియోలో చూసే అవకాశాన్ని కల్పించారు.

అయితే కొంతమందికి ఈ యాడ్స్ చూడటం ఇష్టంలేక పోతే అలాంటివారికి యాడ్ ఫ్రీ వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పనిసరిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా డబ్బు లు చెల్లిస్తే మనకు ఏ విధమైనటువంటి యాడ్స్ రాకుండా నిరంతరంగా ఈ వీడియోని చూడవచ్చు.ఇలా డబ్బులు చెల్లించడం అందరికీ సాధ్యం కాదు కనుక ఎలాంటి డబ్బులు చెల్లించకుండా అలాగే యాడ్స్ లేకుండా చూడటం కోసం
వాన్సెడ్‌ అనే యాప్‌ అందుబాటులోకి వచ్చింది.

ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌పై లభించే ఈ యాప్‌ను ఉపయోగించి యాడ్‌ ఫ్రీగా యూట్యూబ్‌ వీడియోలు చూసే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం ఈ యాప్ పై గూగుల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.తమ కంటెంట్‌పై వాన్సెడ్‌ పెత్తనం ఏంటంటూ న్యాయపరంగా చర్యలకు దిగింది. ఇలా గూగుల్ న్యాయపరమైన చర్యలకు సిద్ధం కావడంతో వాన్సెడ్‌ యాప్ వెనక్కి తగ్గితమ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి తమ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. తప్పనిసరి పరిస్థితులలో ఇలా చేయక తప్పలేదు. ఇన్ని రోజులు మాకు మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ వాన్సెడ్‌ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel