...
Telugu NewsLatestPuspha Movie: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా....శ్రీవల్లి పాటకు మ్యూజిక్ బ్యాండ్ క్రియేట్ చేసిన ముంబై...

Puspha Movie: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా….శ్రీవల్లి పాటకు మ్యూజిక్ బ్యాండ్ క్రియేట్ చేసిన ముంబై పోలీసులు… వీడియో వైరల్!

Puspha Movie Srivalli Song : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ విడుదలైన ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు డైలాగులకు ఎంతోమంది వీడియోలను చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోలను షేర్ చేశారు. ఇలా పుష్ప మానియా దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.ఇక ఈ సినిమా విడుదల అయి మూడు నెలలు దాటిపోయినా ఇంకా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.

Advertisement
Puspha Movie Srivalli Song
Puspha Movie Srivalli Song

ముఖ్యంగా ఈ సినిమాలోని శ్రీవల్లి పాట ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ పాటకు ఎంతోమంది రీల్స్ కూడా చేశారు. నార్త్ లో ఈ పాట బాగా హిట్ అయింది. యూట్యూబ్ లో కూడా శ్రీవల్లి సాంగ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది.ఇదిలా ఉండగా తాజాగా ముంబై పోలీసులు కూడా శ్రీవల్లి పాటకు బ్యాండ్ మ్యూజిక్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement


శ్రీవల్లి పాటకు మ్యూజిక్ బ్యాండ్ వాయించిన పోలీసులు ఆ వీడియోని తమ అధికారక ముంబై పోలీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేశారు. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ ముంబైవాసులు ‘శ్రీవల్లి’ పాటకు ఊగిపోవడం, ఈ పాట అందరికి నచ్చిందని తెలిసి మేము కూడా అందులో చేరిపోయి ఈ పాటను మా కాకి స్టూడియో ద్వారా అందరికీ తెలియజేయాలని భావించాము అంటూ ఈ వీడియోని అధికారిక ముంబై పోలీస్ యూట్యూబ్ చానల్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది పోలీసుల శ్రీవల్లి బ్యాండ్ మ్యూజిక్ కి ఫిదా అవుతూ వీరి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Read Also : Puspha Movie: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా….శ్రీవల్లి పాటకు మ్యూజిక్ బ్యాండ్ క్రియేట్ చేసిన ముంబై పోలీసులు… వీడియో వైరల్!

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు