Roshan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతూ తమకంటూ గుర్తింపు పొందారు. ఈ విధంగా హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. రోషన్ ఇప్పటికే నిర్మలా కాన్వెంట్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం కాగా తాజాగా పెళ్లి సందD సినిమాతో మరోసారి గుర్తింపు పొందారు.ఇలా రెండవ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న రోషన్ తన మూడవ సినిమాని బడా బ్యానర్లో నటించే అవకాశాన్ని పొందారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లో యంగ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రొడక్షన్ నెంబర్ 9 చిత్రాన్ని ప్రకటించారు. రోషన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ హీరో రోషన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో రోషన్ బ్యాక్ ఫోజ్ లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను కలిగిస్తున్నారు.
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే డైరెక్టర్ ప్రదీప్ ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు మొత్తం సిద్ధం చేశారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తూ ఈ సినిమా చిత్రీకరణ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలాంటి బ్యానర్లో నటించే అవకాశాలు దక్కించుకోవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.