Whats App: సరికొత్త ఫీచర్ తో రానున్న వాట్సాప్… ఇకపై గ్రూప్ లో ఆ అవకాశం!

Whats App:ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపించడం సర్వసాధారణం అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో తప్పనిసరిగా ఉన్న యాప్ లో వాట్సాప్ ఒకటి. ఈ వాట్సాప్ కి వినియోగదారులు కూడా అధిక మొత్తం లోనే ఉన్నారని చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ద్వారా వాట్సాప్ యూజర్ల ముందుకు వస్తోంది.అందుకే ఎన్నో రకాల మేనేజింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చినా వాట్సప్ ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా యూజర్లను ఆకట్టుకుంటోంది.

ఇక తాజాగా వాట్సాప్ నుంచి యూపీఏ ట్రాన్సాక్షన్ కూడా మనకు అందుబాటులో ఉండటం వల్ల వాట్సప్ కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా వాట్సాప్ సరి కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ముందుకు రాబోతుంది. మరి ఆ ఫీచర్ ఏంటి అనే విషయానికి వస్తే…. వాట్సాప్ తన యూజర్ల కోసం
గ్రూప్‌ చాట్‌లలో పోల్స్‌ ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి వాట్సాప్‌ బీటా ఇన్ఫో స్క్రీన్‌ షాట్స్‌ను విడుదల చేసింది. ఇంతకీ ఈ గ్రూప్ పోల్స్ ఫీచర్ అంటే ఏమిటి దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే….

ఈ ఫీచర్ సహాయం ద్వారా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నవారు గ్రూప్ లో ఏదైనా ఒక అంశం పై ఓటింగ్ పోల్స్ నిర్వహించవచ్చు. ఇక ఆ ప్రశ్నకు గ్రూప్ లో ఉన్న వారందరూ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. అయితే గ్రూప్ లో ఉన్నవారు మాత్రమే ఈ ఓటింగ్ ఫలితాలను చూస్తే వెసులుబాటు కల్పించనున్నారు. అయితే ఇప్పటివరకు ఇలాంటి ఫీచర్ టెలిగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్ లో మనకు అందుబాటులో ఉంది. ఈ క్రమంలోనే ఈ ఫీచర్ ను వాట్సాప్ యూజర్లకు అనుగుణంగా ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel