Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మహేంద్ర వర్మ అక్కడికి రావడంతో దేవయానికి కోపం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర గౌతమ్ హాల్లో కూర్చుని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. అప్పుడు గౌతమ్, రిషి ని పిలవడంతో అప్పుడు మహేంద్ర తన మనసులో నాతో రిషి మాట్లాడడేమో అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రిషి,మహేంద్ర దగ్గరికి వచ్చి భోజనం చేశారా అని అడుగుతాడు.
దాంతో మహేంద్ర సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ నువ్వు వసుదార ని ఏమైనా అన్నావా అని అనగా ఇంతలోనే అక్కడికి జగతి వస్తుంది. అప్పుడు రిషి నా ఇష్టం నేను తిడతాను.. తిట్టనో అంటూ అక్కడి నుంచి వెళ్తు జగతిని ఉద్దేశించి మాట్లాడడంతో జగతి బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు వసుధారా క్లాస్ రూమ్ లో బోర్డు మీద యాంగ్రీ ప్రిన్స్ అని రాసి తనను తానే మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు.
ఆ తర్వాత వారిద్దరు ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంతేకాదు నీకు మూడు రోజుల సమయం ఇస్తున్నాను మీ దగ్గర నుంచి నాకు సమాధానం రావాలి అని అనగా అప్పుడు వసుధార కాస్త బ్రతిమలాడినట్టుగా కనిపించడంతో వెంటనే రిషి మన ప్రేమ కోసమైనా నువ్వు చేయాలి అని అంటాడు.
అప్పుడు వసుధార ఎమోషనల్ అవుతూ నా ప్రేమలో స్వార్థం లేదు అని అనగా వెంటనే రిషి నాకు తెలుసు మూడు రోజుల్లో సమాధానం రావాలి అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు ధరణి, వసు దగ్గరికి వచ్చి తన మరిచిపోయిన బ్యాగ్ ఇస్తుంది. వసుధారతో మాట్లాడి అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఇంతలోనే చిన్న ప్రమాదం జరిగి దెబ్బలు తగులుతాయి.
ఆ తర్వాత ధరణి ఇంటికి పిలుచుకుని వెళుతుంది. అప్పుడు దేవయాని ధరణి నీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఆ తర్వాత జగతి ధరణి కోసం వేడి నీళ్ళు తీసుకొని వెళ్తూ ఉండగా అప్పుడు దేవయాని కాఫీ అడుగుతుంది. అప్పుడు జగతి ధరణికి తీసుకొని వెళుతున్నాను అక్కయ్య కొద్దిసేపు ఉండండి అని అనగా ఇంతలోనే వసుధార అక్కడికి వచ్చి మేడం నేను ధరణి మేడంకీ వేడి నీళ్లు తీసుకొని వెళ్తాను మీరు పెద్ద మేడం కి కాఫీ ఇవ్వండి అని అంటుంది.
అప్పుడు దేవయాని వసుధార మీద కోప్పడగా అప్పుడు వసు తనదైన శైలిలో మాధానం ఇస్తుంది. ఇంతలోనే గౌతమ్ అక్కడికి వచ్చి నాకు కూడా కాఫీ కావాలి అని అంటాడు. అప్పుడు దేవయాని రిషి గురించి మాట్లాడగా వాడు ఎప్పుడు ఏం చెబుతాడు ఏం ఆలోచిస్తాడో కూడా తెలియదు ఆంటీ అని అనడంతో గౌతమ్ ని వెటకారంగా మాట్లాడిస్తుంది దేవయాని.
Tufan9 Telugu News And Updates Breaking News All over World